టీడీపీ వర్సెస్ జనసేన: ఎవరికి ఎవరు అవసరం..?

VUYYURU SUBHASH
టీడీపీ-జనసేనల పొత్తు ఉంటుందా? అసలు పొత్తు వల్ల ఎవరికి బెనిఫిట్ కలుగుతుంది? చంద్రబాబు పొత్తు పట్ల ఆసక్తిగా ఉన్న..పవన్‌కు ఇంటరెస్ట్ ఎందుకు లేదు? జనసేనకు సొంతంగా సత్తా చాటే ఛాన్స్ ఉందా? అంటే ఏ ప్రశ్నలు అన్నిటికి ఆ రెండు పార్టీల నేతలే సమాధానం చెబితే బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే పొత్తు అంశం వారే తేల్చుకోవాలి. కాకపోతే రాజకీయంగా విశ్లేషిస్తే...పొత్తు వల్ల ఎవరికి లాభం...జనసేనకు సింగిల్‌గా సత్తా చాటే అవకాశం ఉందా? అనేది చూసుకుంటే...జనసేనకు మాత్రం ఒంటరిగా పోటీ చేసే గెలిచే సత్తా ఏ మాత్రం లేదు.

ఏదో పేరుకు బీజేపీతో పొత్తు ఉంది గానీ...ఆ పార్టీ వల్ల జనసేనకు పావలా ప్రయోజనం లేదు. పైగా జనసేన వల్లే బీజేపీకి లాభం. కాబట్టి బీజేపీతో పొత్తు ఉన్నా సరే జనసేన గెలిచే అవకాశాలు లేవు. బలమైన టీడీపీ-వైసీపీల మధ్య ఆ పార్టీ గెలవలేదు. గత ఎన్నికల్లో ఒక సీటు వచ్చింది...ఇప్పుడు మహా అయితే 5 సీట్లు వరకు గెలుచుకుంటుందేమో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అదే టీడీపీతో పొత్తు ఉంటే ఒక 30-40 సీట్లు తీసుకున్న సరే..కనీసం 20పైనే సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చేపూచ్చు. అంటే టీడీపీతో పొత్తు ఉంటేనే జనసేనకు ప్లస్. అదే సమయంలో జనసేనతో పొత్తు ఉంటేనే టీడీపీ...వైసీపీకి చెక్ పెట్టగలదు. లేదంటే జనసేన వల్ల ఓట్లు చీలిపోయి టీడీపీకి బొక్క పడుతుంది. గత ఎన్నికల్లో అదే జరిగింది.

ఒకవేళ అప్పుడే కలిసి ఉంటే టీడీపీకి 23 సీట్లు కాదు..ఓడిపోయినా సరే కనీసం 60 సీట్లు వచ్చేవి. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసిన సరే టీడీపీకి డ్యామేజ్ తప్పదు. అదే కలిస్తే మాత్రం టీడీపీకి బాగా బెనిఫిట్ అవుతుంది. అంటే ఇక్కడ పొత్తు ఉంటే టీడీపీ-జనసేనలకు లాభం...లేదంటే రెండు పార్టీలకు నష్టం. రెండు పార్టీలకు ఒకరి అవసరం ఒకరికి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: