సిఎం కెసిఆర్ ను జైలుకు పంపిస్తాం ?

Veldandi Saikiran
రానున్న రోజుల్లో కెసిఆర్ ను ప్రజలు పరిగెత్తిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి  కెసిఆర్ నేతృత్వంలో పోలీసులు దాడి చేసారో దేశం మొత్తం చూస్తుందని ఫైర్ అయ్యారు.  నా కార్యాలయంలో దాడులు చేసి, ధ్వంసం చేశారు.నా కార్యాలయంలో ఫైల్ లు ,అన్ని నాశనం చేశారని.. 317 జీవో రద్దు చేయాలి, నిన్ను ఫామ్ హౌస్ లో పడుకోవడానికి నిన్ను ముఖ్యమంత్రి గా ఎన్నుకోలేదని అగ్రహించారు బండి సంజయ్.  ఉద్యోగుల ఆరోగ్యం, కాకముందే ఈ జీవోసవరణ చేయాలి.యు ట్యూబ్ విలేకరులతో  పైన కేస్ లు పెడుతున్నారని.. నీకు వత్తాసు పలుకుతీ కేసులు లేవు, లేక పోతే కేసులు పెట్టి బెదరిస్తావ,రాష్ర్టంలో రాక్షశా పాలన, కుటుంబ పాలన సాగుతుందని రెచ్చిపోయారు.

 రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంది.నిన్ను, నీ కొడుకును ఎట్టి పరిస్థితుల్లో వదలమని హెచ్చరించారు.  సమస్య ఇంకా జేటిలం కాకుండా చూడాలి.ఉద్యోగుల ఇప్పుడు పోరాటం చేయండి, మీరు చేయకపోతే మీరే నష్ట పోతారు, మీ వెంట మేము, బీజేపీ ఉంటుంది.. అవసరమైతే ముఖ్యమంత్రి ఉద్యోగుల ను, ఉద్యోగ సంఘాలు చెలిచ్చి పరిపాలన చేస్తాడు నిరుద్యోగ సమస్య మీద పోరాడుదామన్నారు. నిరుద్యోగ ఎంత మంది ఉన్నారో తెలుసా ? అని ప్రశ్నించారు. 
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన దారుణ మారుణ కాండ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని,, ఘటనను గురించి తెలుసుకునేందుకు చత్తీష్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ ఇక్కడికి వచ్చారన్నారు.  

డాక్టర్ కె.లక్ష్మణ్ ను రాత్రి 9 గంటలకు అరెస్టు చేసి తెల్లవార్లు చలిలో ఉంచడం ప్రభుత్వ మూర్ఖత్వానికి పరాకాష్ట అని అగ్రహించారు. తెలంగాణలో రాక్షస, నియంత, గడీల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామని.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించడానికి మేం చేస్తున్న ప్రయత్నాలకు జాతీయ నాయకత్వం పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు. ఇంతటి గొప్ప పార్టీలో కొనసాగడం మా అద్రుష్టం భావిస్తున్నానని.. ఘటనలో జర్నలిస్టులపై పోలీసులు దాడి చేశారు అయినా మౌనంగా ఉండటం బాధేస్తోందని తెలిపారు.  మాకు జైలు కొత్త కాదు ఎన్నోసార్లు జైలుకు వెళ్లామని హెచ్చరించారు.  కెసిఆర్ ను జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: