క్వారంటైన్ ఎన్ని రోజులైతే బెటర్.. డబ్ల్యూహెచ్వో కీలక వ్యాఖ్యలు?
అయితే ప్రస్తుతం ప్రపంచ ప్రజానీకం మొత్తం వ్యాక్సిన్ వేసుకొని కరోనా వైరస్ పోరాటానికి సిద్ధమైపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అందరూ వ్యాక్సిన్ వేసుకున్నామని ధైర్యంగా ఉంటున్న సమయంలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వెలుగులోకి వచ్చి అందరిలో మరింత భయాందోళనలు కలిగిస్తోంది. సౌత్ ఆఫ్రికా లో వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ ప్రస్తుతం ప్రపంచదేశాలకు చాపకింద నీరులా పాకిపోతోంది. అయితే ఒకప్పుడు కరోనా వైరస్ బారిన పడగానే అందరూ భయంతో ఆసుపత్రులకు పరుగులు పెట్టేవారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం కరోనా వైరస్ సోకినఇప్పటికీ ఎవరూ ఎక్కువగా భయపడటం లేదు.
వైరస్ బారిన పడిన తర్వాత హోమ్ క్వారంటైన్ లో ఉంటూ వైరస్ నుంచి బయటపడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో కేవలం ఏడు రోజుల వ్యవధిలోనే కరోనా వ్యాధి బారినుంచి కోరుకుంటున్నారు చాలామంది. ఆ తర్వాత ఎప్పటిలాగే బయట తిరుగుతున్నారు. కానీ అలా తిరగడం ప్రమాదకరం అంటూ హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. క్వారంటైన్ లో తప్పనిసరిగా 14 రోజుల పాటు ఉండడమే మేలు అంటూ సిఫార్సు చేసింది.. పరిస్థితిని బట్టి ఈ క్వారంటైన్ పరిస్థితి ఎన్ని రోజులు ఉండాలని నిర్ణయం ఆయా దేశాల తీసుకోవాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు డాక్టర్ అబ్ది మహాముడ్ అన్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో అన్ని దేశాలలో మళ్ళీ కఠిన ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.