సీన్లోకి గంటా : ఇదిగో స్టేట్మెంట్ ! హ‌మ్మ‌య్య టీడీపీలోనే ఉన్నాడ్రా!

RATNA KISHORE
టీడీపీలో ఓ వింత స్థితి నెల‌కొని ఉంది.ఎవరున్నారో పార్టీకి తెలియ‌దు.ఎవ‌రు ఎందుకు ఉన్నారో కూడా పార్టీకి తెలియ‌దు.ఎన్నిక‌ల ముందు టిక్కెట్ల కోసం గ‌లాభా చేయ‌డం త‌ప్ప వీరి వ‌ల్ల లాభం లేదు అని అధిష్టానంకు ఎప్పుడు తెలిసివ‌స్తుందో మ‌రి!అదేవిధంగా పార్టీ ఇచ్చే పిలుపును సైతం లెక్క చేయ‌ని,నిర‌స‌న‌ల‌కు సైతం రోడ్డెక్క‌ని నాయ‌కు లు ఎంద‌రో!ఇదే క్ర‌మంలో చాలా మంది విశాఖ నేత‌లు ఉన్నారు.వారిలో గంటా శ్రీ‌ను ఒక‌రు.సీనియ‌ర్ లీడ‌ర్ హోదాలో ఉండ‌డం త‌ప్ప ఆయ‌న చేసిందేం లేదు.అందుకే ఆయ‌ న పార్టీలో ఉన్నారో లేదో తెలియ‌ని తిక‌మ‌క‌లో నేత‌లున్నారు.ఈ క్ర‌మంలో నిన్న‌టి వేళ జ‌రిగిన ఓ దుర్ఘ‌ట‌న‌పై గంటా ప్ర‌శ్నించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.అన్న‌గారి విగ్ర‌హానికి గుంటూరు జిల్లాలో అవ‌మానం జ‌రిగింద‌న్న టీడీపీ అధిష్టానం ఆవేద‌న‌కు ఆయ‌న క‌రిగిపోయి,ఎట్టకేల‌కు క‌దిలివ‌చ్చారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌నేమ‌న్నారంటే...
తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుదిక్కుల విస్తరింపచేసిన అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్ర హం ధ్వంసం చేయటం అంటే మన తెలుగు జాతిని అవమానించినట్లే, అన్నగారి విగ్రహం ధ్వంసం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నాను,  ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
- గంటా శ్రీ‌నివాస‌రావు, మాజీ ఎమ్మెల్యే, భీమిలి నియోజ‌క‌వ‌ర్గం



ఉన్నారో లేదో?
ఎవ‌రికి ఎరుక‌!
అంతా విష్ణు మాయ

టీడీపీలో ఆయ‌న ఉన్నారో లేదో అని చెక్ చేసుకునేవారికి గంటా ఉన్నార‌ని,ఆయ‌న ఏ పార్టీలో మార‌లేద‌ని త‌ప్ప‌క తెలిసేలే ఎఫ్బీ పోస్టు ఒక‌టి నెట్టింట్లో హ‌ల్ చేస్తుంది. నిన్న‌టివేళ గుంటూరులో జరిగిన (లేదా జ‌రిగింద‌ని భావించేందుకు ఆస్కారం ఉన్న లేదా అలాంటి ఆరోప‌ణ ఒక‌టి న‌డుస్తున్న త‌రుణాన‌) గంటా శ్రీ‌ను సీన్లోకి వ‌చ్చి, త‌న అభ్యంత‌రాన్నీ,విష‌య తీవ్ర‌త‌ను వెల్ల‌డిస్తూ నాలుగు మాట‌లు రాసి వెళ్లారు.దీని త‌రువాత ఆయ‌న ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ ఎలా ఉండనున్న‌ది త‌రువాత తెలుసుకోవాలి.

అధినేత‌కు ఊర‌టే కానీ..
ఎందుకంటే గంటా శ్రీ‌ను ఎప్ప‌టి  నుంచో వైసీపీకి వెళ్లాల‌ని భావిస్తున్న నేత.అక్క‌డికి వెళ్ల‌లేక,ఇక్క‌డ ఉండ‌లేక కాలం వెళ్ల‌దీస్తున్న నేత.యాక్టివ్ పొలిటీషియ‌న్ గా పెద్ద‌గా పేరు లేని నేత‌గా ప్ర‌స్తుతం విశాఖ రాజ‌కీయాల్లో సైలెంట్ మోడ్ లో ఉన్నారు. కానీ చాలా రోజుల త‌రువాత ఆయ‌న వైబ్రేటివ్ మోడ్ లోకి వ‌చ్చి నాలుగు మాట‌లు రాసి వెళ్ల‌డంతో హ‌మ్మ‌య్య అని చంద్ర‌బాబు కూడా ఊపిరి పీల్చుకున్న ప‌ని ఒక‌టి జ‌రిగిపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: