టీడీపీలో కట్టప్పలు పెరిగిపోయారా ?
ఈ ఇద్దరు నేతల బాధలు పడలేక చాలా మంది వైసీపీలో చేరిపోయిన పరిస్థితి ఉంది. బాబు ఇప్పటికీ పట్టించుకోకపోతే అక్కడ వచ్చే ఎన్నికల్లో బాబు గెలవడం కూడా కష్టమే అన్న నివేదికలు బాబుకు వెళ్ళిపోయాయి. కుప్పంలో గత 30 సంవత్సరాల నుంచి చంద్రబాబు వెంటే ఉన్న కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు. అయితే అక్కడ పార్టీలో వెన్నుపోటు పొడుస్తున్న నాయకులను మాత్రం చంద్రబాబు ఏం చేయలేకపోతున్నారు.
కీలక నేతలపై ఇప్పటికిప్పుడు వేటు వేసి వారిని పార్టీ నుంచి బయటకు పంపించేందుకు చంద్రబాబు ఇష్టపడటం లేదని అంటున్నారు. అయితే ఇదే పరిస్థితి కొనసాగితే వైసిపి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు పూర్తిగా చెక్ పెట్టేలా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. ఇటీవల జరిగిన గొప్ప మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. మరోవైపు చాపకింద నీరులా 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు చెక్ పెట్టాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
మరోవైపు చంద్రబాబు రాష్ట్రంలో పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి ? ఇటు కుప్పంలో తన కంచుకోట కోట ఎలా కాపాడుకోవాలి అన్న విషయం లో పెద్ద డైలమాలోనే ఉన్నారు.