ఈటలకు బండి బ్రేకులు?
అయితే అంతా కలిసికట్టుగా పనిచేస్తారనుకునే బీజేపీలోకి కూడా ఈ రచ్చ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ మాదిరిగా బయట పడకపోయినా, అంతర్గతంగా మాత్రం ఆ ఆధిపత్య పోరు కమలంలో కూడా ఎక్కువ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చాకే ఈ రచ్చ పెరిగిందని తెలుస్తోంది. వాస్తవానికి చెప్పాలంటే బీజేపీలో ఈటలకు సరితూగే నేతలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ వేరు.
పైగా హుజూరాబాద్‌లో సొంత ఇమేజ్‌తో మళ్ళీ గెలవడంతో సీన్ మారిపోయింది. ఇప్పుడు ఈయన ప్రతి జిల్లాలోనూ ఎంట్రీ ఇస్తున్నారు. బీజేపీ నేతలని సమన్వయం చేస్తున్నారు. అయితే ఈ అంశం కొందరు నేతలకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. ఈటల లీడింగ్‌ని ఒప్పుకునే పరిస్తితిలో కొందరు బీజేపీ నేతలు లేరని చెప్పొచ్చు. అసలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌నే ఈటల హవాని తట్టుకోలేకపోతున్నారన్నట్లు పరిస్తితి ఉంది.
ఎందుకంటే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్ధి రవీందర్ సింగ్‌కు ఈటల మద్ధతు ఇచ్చారు. కానీ బండి గానీ, బీజేపీ నేతలుగానీ మద్ధతు ఇవ్వలేదు. ఇక ఆయన ఓడిపోయినా సరే బాగానే ఓట్లు తెచ్చుకున్నారు. ఎన్నికలైన వెంటనే ఈయన బీజేపీలో చేరతారని అంతా అనుకున్నారు. కానీ బండి మాత్రం రవీందర్‌ని బీజేపీలోకి ఆహ్వానించలేదు. దీంతో ఆయన మళ్ళీ టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయారు. అంటే ఈటలకు లీడ్ రాకూడదనే బండి ఇలా చేసినట్లు కనిపిస్తోంది.