అమెరికా వణుకుతుంది.. కారణం అదే?

praveen
ప్రస్తుతం ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ ఎంతలా విజృంభించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వినూత్నమైన టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ అగ్రరాజ్యాల లో మాత్రం కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తుంది అని చెప్పాలి. ఒకవైపు ప్రభుత్వాలు ఎన్ని కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చినప్పటికీ ఎక్కడ కరోనా వైరస్ ను మాత్రం  ఆంక్షలు కట్టడి చేయలేక పోతున్నాయ్. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం ఇప్పటివరకు అత్యధికంగా ఎదుర్కొన్న దేశాలలో అగ్ర రాజ్యాలుగా కొనసాగుతున్న బ్రిటన్ అమెరికా లాంటి దేశాల్లో ముందు స్థానంలో ఉన్నాయ్ అన్న విషయం తెలిసిందే.


 ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికా లో అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తీవ్ర ఆందోళనకరంగా మారిపోతుంది. ఓవైపు ఓమిక్రాన్  వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూ ఉంటే మరోవైపు కరోనా వైరస్ కేసుల సంఖ్య ప్రతిరోజు లక్షల్లో నమోదు అవుతూ ఉండడంతో అక్కడి ప్రజలందరూ ప్రాణభయంతో వణికిపోతున్నారు. దేశ జనాభాతో పోల్చి చూస్తే అటు పెరుగుతున్న కేసులు మాత్రం ప్రమాదకరంగా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఇక భారీగా కేసులు పెరిగిపోతుండడంతో ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో కరోనా నాలుగవ దశ కూడా వచ్చేసింది అన్న ప్రచారం కూడా ఊపందుకుంది.


 అయితే నిన్న రెండు లక్షల 45 వేల కొత్త కేసులు వెలుగులోకి రాగా.. ఈ రోజు అమెరికాలో ఒకే రోజు 5 లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి రావడం ఆందోళనకరంగా మారిపోయింది. అమెరికా మొత్తం జనాభా 35  కోట్లు కాగా.. ప్రస్తుత అమెరికా లో యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య ఐదు కోట్లకు చేరుకుంది. ఇది అంత ఆషామాషీ విషయం కాదు అని అంటున్నారు విశ్లేషకులు. ఎంతో ప్రమాదకరమైన టువంటి విపత్కర పరిస్థితుల్లో కి  అమెరికా వెళ్లి పోతుంది అని అంటున్నారు విశ్లేషకులు. ఇక ప్రస్తుతం భయాందోళన పరిస్థితుల్లోకి అమెరికా క్రమక్రమంగా జారుకుంటుందని  అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: