అమరావతి : పవన్నే తప్పుపట్టిన కాపునాడు

Vijaya


విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిని కాపునాడు నేతలే తప్పుపడుతున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో నేరుగా అడగాల్సిన వారిని అడగకుండా వైసీపీ ఎంపీలను మాత్రమే ప్రశ్నించాలని పవన్ చెప్పటంలో అర్ధంలేదంటున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనాలంతా డిజిటిల్ క్యాంపెయినింగ్ చేసి వైసీపీ, టీడీపీ ఎంపీలకు ట్యాగ్ చేయాలని పవన్ పిలుపిచ్చిన విషయం తెలిసిందే. పవన్ పిలుపునే కాపునాడు రాజకీయ విశ్లేషకుడు చింతా రాజశేఖర్ తప్పుపట్టారు.




ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా పవన్ ఇచ్చిన పిలుపు బాగానే ఉన్నా అసలు ట్యాగ్ చేయాల్సిన నరేంద్రమోడిని అమిత్ షా ను వదిలేయటం తప్పని రాజశేఖర్ చెప్పారు. పవన్ పిలుపులో కేవలం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత మాత్రమే కనబడుతోందని అభిప్రాయపడ్డారు. స్టీల్ ఫ్యాక్టరీ అనేక మొత్తం రాష్ట్రానికంతంటికి సంబంధించిన విషయం కాబట్టి డైరెక్టుగా మోడీనే పవన్ ట్యాగ్ చేయాలన్నారు. నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్న మోడీని వదిలేసి కేవలం జగన్ను మాత్రమే పవన్ టార్గెట్ చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు.




సినిమాల్లో లాగేనే తన ప్రత్యర్ధి ఎంత బలంగా ఉంటే హీరోయిజం అంత బాగా వర్కవుటైనట్లే మోడీ, జగన్ లో తనకు బలమైన  ప్రత్యర్ధి ఎవరనే విషయాన్ని పవనే ఎంచుకోవాలన్నారు. జగన్ మీద పోరాటం చేసేబదులు మోడీ మీద పోరాటం చేస్తేనే పవన్ కు జాతీయస్ధాయిలో ఇమేజి వస్తుందని అభప్రాయపడ్డారు. పవన్ చేసే పోరాటమంతా కేవలం జగన్ మీద మాత్రమే అని ఇప్పటికే జనాలకు అర్ధమైపోయిందని చింతా తెలిపారు. దీనివల్ల పవన్ కు జరిగే ఉపయోగం ఏమీలేదనా ఆయన అభిప్రాయపడ్డారు.




పవన్ వైఖరి చూస్తే చంద్రబాబునాయుడు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్లుందన్నారు. జనాల్లో ఇలాంటి అభిప్రాయం కలిగించటం పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఎంతమాత్రం లాభించదన్నారు. కానీ పవన్ వ్యవహారం చూసిన జనాలకు మాత్రం అదే అర్ధమవుతోందని చెప్పారు. మరి ఇలాంటి ముద్రలో నుండి పవన్ ఎలా బయలపడతారో ? ఎప్పటికి బయటపడతారో చూడాల్సిందే అన్నారు.




చింతా అభిప్రాయం చూసిన తర్వాత  పవన్ వ్యవహార శైలిపై కాపునాడు పెద్దలు కూడా అంత హ్యాపీగా లేరని అర్ధమవుతోంది. సొంత సామాజికవర్గంలోని ప్రముఖులే హ్యాపీగా లేనపుడు మిగిలిన జనాలు మాత్రం పవన్ కు ఎందుకు సానుకూలంగా ఉంటారన్నదే అసలైన ప్రశ్న. ఒకవైపు షెడ్యూల్ ఎన్నికలకు మరో రెండున్నర సంవవత్సరమే గడువుంది. తనపైన పడిన ముద్రనుండి పవన్ ఎప్పుడు బయటపడతారో ? అసలు బయటపడతారా ? చూడాల్సిందే.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: