రాధా బ్యాగ్రౌండ్ వర్క్: టీడీపీ కోసం ఇంత చేస్తున్నారా...?
ఇదే సమయంలో రాధాని వైసీపీలోకి తీసుకెళ్లడానికి కొడాలి నాని, వల్లభనేని వంశీలు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రచారం జరుగుతుండగానే, రాధాతో చంద్రబాబు మాట్లాడి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దీంతో ఆయన వైసీపీలోకి వెళ్లరనే క్లారిటీ మాత్రం వచ్చింది. ఈ క్రమంలోనే రాధా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా బయటకొచ్చాయి. తాజాగా కొలికిపూడి శ్రీనివాసరావు అనే రాజకీయ విశ్లేషకుడు రాధా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
వాస్తవానికి రాధా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటం లేదనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల ముందు టీడీపీలోనే చేరిన...ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక రాజకీయంగా అంతగా యాక్టివ్ గా లేరు. అలా అని వేరే పార్టీలోకి వెళ్లలేదు. తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో తన సొంత సామాజికవర్గం కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు.
అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది...రాధా పార్టీలో కనిపించకపోయినా, టీడీపీ కోసం బ్యాగ్రౌండ్‌లో వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. కాపు సామాజికవర్గం ప్రభావం ఉన్న ఓ 50 నియోజకవర్గాలపై ఫోకస్ చేసి, మళ్ళీ అక్కడ టీడీపీ బలోపేతం కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని కొలికిపూడి స్వయంగా వెల్లడించారు. సైలెంట్‌గా రాధా పార్టీ కోసం పనిచేస్తున్నారని, మళ్ళీ చంద్రబాబుని సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారని అంటున్నారు. మరి మాటల్లో ఎంత నిజం ఉందో భవిష్యత్‌లో తెలుస్తుంది.