రెండు డైలాగులు.. నాలుగు ప్ర‌సంగాలు.. జ‌న‌సేన రాజ‌కీయం ఎటువైపు...?

VUYYURU SUBHASH
రాజ‌కీయంగా నిల‌దొక్కుకోవాలంటే.. ఏ పార్టీకైనా ఏం కావాలి? ప్ర‌జ‌ల మ‌ద్దతు కూడ‌గ‌ట్టాలంటే.. ఏం చేయాలి? ఇవీ..ఇప్పుడు జ‌న‌సేన‌ను వేధిస్తున్న ప్ర‌శ్న‌లు. ఎందుకంటే.. పార్టీ ఎవ‌రిదైనా.. ఎంత ప్ర‌జాభిమానం ఉన్నా.. ఓట్ల రూపంలో సాధించాలంటే.. అధికారంలోకి రావాలంటే.. లేదా అధికార ప‌క్షంగా ఉండాలంటే.. ఖ‌చ్చితంగా ప్ర‌తి పార్టీకి ప్ర‌జ‌ల ఫాలోయింగ్ అవ‌స‌రం. అయితే.. ఈ విష‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డో విఫ‌ల‌మ‌వుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. ఆయ‌న పారర్టీపెట్టి ఇప్ప‌టికే 8 సంవ‌త్సాలు అయిపోయింది. మ‌రి ఈ 8 ఏళ్ల‌లో ఆయ‌న సాధించింది ఏమైనా ఉందా? అంటే.. క‌నిపించ‌డం లేదు.

పోనీ.. ఫ‌స్ట్ టైం  పార్టీని పోటీకి పెట్ట‌లేదు క‌నుక‌.. స‌రే.. అని అనుకోవ‌చ్చు. కానీ, 2019లో మాత్రం అలా కాదుక‌దా.. ఆయ‌న పోటీకి దిగారు. అయితే.. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్ట‌లేక పోయారు. మ‌రి మ‌రోరెండున్న‌రేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. అప్పుడైనా.. ఆయ‌న విజ‌యం ద‌క్కించుకుంటారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఒక వ్యూహం లేదు.. ఒక దిశ‌లేదు.. పోరాడే స‌త్తా అంత‌క‌న్నా లేదు.. అనే మాట జోరుగా వినిపిస్తోంది. నిజానికి పోరాడ‌క‌పోయినా.. ఫ‌ర్వాలేదు.. ప్ర‌జ‌లు.. ఇది మాపార్టీప‌.. ఈయ‌న మ‌న‌కోసం ఉన్నాడు.. అనే ఆలోచ‌న క‌లిగించేలా అయినా.. నాయ‌కుడు వ్య‌వ‌హ‌రించాలి .. క‌దా? అంటే.. ఆ దిశ‌గా కూడా ప‌వ‌న్ అడుగులు ప‌డ‌డం లేదు.

ఈ క్ర‌మంలో నాయ‌కులు కూడా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఏం చేయాలి?  అస‌లు పార్టీలో ఉండాలా?  వ‌ద్దా? అనే సంశ‌యం వెంటాడుతోంది. ఎందుకంటే.. ప‌వ‌న్ వ్యాప‌కాలు వేరే ఉన్నాయి. ఆయ‌న‌కు ఎలాగైనా.. మ‌ద్ద‌తు ఉంటుంది. కానీ, నాయ‌కుల ప‌రిస్థితి ఏంటి?  ఒక క‌మ్యూనిస్టు పార్టీగా మారిపోతే.. త‌మ ప‌రిస్థితి ఏంటి? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇత ర పార్టీల‌ను చూసుకుంటే.. ఏదో ఒక ర‌కంగా ముందుకు సాగుతున్నాయి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూ.. నిరంత‌రం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నాయి.

కానీ, ఎప్పుడో గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడు రావ‌డం.. నాలుగు సినిమా డైలాగులు పేల్చ‌డం.. రెండు ప్ర‌సంగాలు ఇవ్వ‌డంతోనే స‌రిపెడుతుంటే.. నాయ‌కుడిగా.. ఆయ‌న క‌న్నా.. కార్య‌క‌ర్త‌లు..గా తాము న‌లిగిపోతున్నామ‌ని..చెబుతున్నారు. వాస్త‌వానికి గ్రామ‌స్థాయిలో ఇప్ప‌టికీ జ‌న‌సేన‌కు ప‌ట్టులేదు. కార్య‌క‌ర్త‌లు లేరు. పోనీ.. కాపు సామాజిక‌వ‌ర్గం బ‌లంగా నిలుస్తుందా? అంటే.. ఇది కూడా చెప్ప‌డం క‌ష్టంగానే ఉంది. బ‌ల‌మైన వ‌ర్గం అంతా.. కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన ప‌రిస్థితిపై నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏంచేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: