సజ్జనార్ మరో షాకింగ్ నిర్ణయం.. రాత్రి 8 గంటల వరకే?
ఈ క్రమంలోనే కేవలం ఆఫీసుకు మాత్రమే పరిమితం కాకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికుల అవసరాలను ఇబ్బందులను తెలుసుకుంటూ వాటిని తీర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.. అంతేకాకుండా మహిళల రక్షణ కోసం రాత్రి సమయంలో వారు ఎక్కడ బస్ ఆపమంటే అక్కడ బస్సు ఆపాలి అంటూ కొత్త రూల్ తెరమీదకు తీసుకువచ్చారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో షాకింగ్ నిర్ణయం తీసుకొని మహిళా కండక్టర్లకు శుభవార్త చెప్పారు. టి ఎస్ ఆర్ టి సి లో పనిచేస్తున్న మహిళా కండక్టర్ లు కొన్ని కొన్ని సార్లు రాత్రి సమయంలో డ్యూటీ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఇక ఇలాంటి ఇబ్బందులను అర్థం చేసుకున్నా టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటల వరకు మాత్రమే తమ తమ డిపోలకు చేరేలా డ్యూటీ వేయాలి అంటూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు సజ్జనార్. అయితే గతంలో కొద్దిరోజుల వరకు రాత్రి ఎనిమిది గంటల కల్లా మహిళా కండక్టర్ విధులు ముగిసేలా చర్యలు తీసుకున్నప్పటికీ.. ఆ తర్వాత దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ విషయాన్ని ఇటీవల ఎంతో మంది మహిళా కండక్టర్ను టి ఎస్ ఆర్ టి సి ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లడంతో తాజా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ నిర్ణయం ద్వారా మహిళా కండక్టర్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది అని అంటున్నారు విశ్లేషకులు.