అగ్రరాజ్యానికి కష్టమొచ్చింది.. వారితోనే అసలు దెబ్బ?
ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వం తల పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా అమెరికా వ్యాక్సిన్ తయారు చేసింది. అలాంటి అమెరికాలో కేవలం 65 శాతం మంది ప్రజలు మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్నారు అన్న విషయం ఇటీవల ఒక నివేదికలో బయటపడింది. మిగతా 35 శాతం మంది ప్రజలు కనీసం వ్యాక్సిన్ వేసుకోవడానికి కూడా ఆసక్తి చూపించడం లేదట. ఇక ఇలాంటి వాళ్ళ వల్లే ప్రస్తుతం అగ్రరాజ్యమైన అమెరికా కు దెబ్బ పడుతుంది అంటున్నారు విశ్లేషకులు. అయితే వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వం చెబితే వేసుకునే ప్రసక్తే లేదు అటు ప్రజలు ఉద్యమాల బాట పడుతూ ఉండటం గమనార్హం.
ప్రస్తుతం కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రపంచ ప్రజానీకం వ్యాక్సిన్ వేసుకొని కరోనా వైరస్ తో పోరాటానికి సిద్ధం అవుతున్నారు. ఇలా దాదాపు చిన్న చిన్న దేశాలు సైతం 100% వ్యాక్సినేషన్ దిశగా దూసుకుపోతున్నాయి. అలాంటిది అగ్రరాజ్యమైన అమెరికా లో ఏకంగా 35 శాతం మంది వ్యాక్సిన్ వేసుకోకపోవడం.. కనీసం వేసుకోవడానికి కూడా ఆసక్తి చూపకపోవడం అమెరికా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. వీరి కారణంగానే వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి అన్నది ఇటీవలే నివేదికలో వెల్లడయ్యింది.