వామ్మో.. గూగుల్ కే షాకిచ్చిన టిక్ టాక్?

praveen
ఇటీవలి కాలం లో మొబైల్ వినియోగం  ఎంతలా  పెరిగి పోతోంది ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుత మొబైల్ వినియోగం పెరిగి పోయిన నేపథ్యం లో  సోషల్ మీడియా వాడకం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. ఏది కావాలన్నా కూడా సమాచారం సోషల్ మీడియాలో దొరుకుతూ ఉండడంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరు సోషల్ మీడియా లోనే గంటల తరబడి కాలం గడుపుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలా ప్రస్తుతం ఎన్నో రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి అని చెప్పాలి.



 ఈ క్రమం లోనే ఇలా ఒక ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ గా అందరికీ దగ్గరై తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది టిక్టాక్. చైనా కు సంబంధించిన ఈ టిక్ టాక్ సంస్థ అటు భారత్లో ఎంతో మందిని ఆకర్షించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ యాప్ ద్వారా కొత్తరకం ఎంటర్టైన్మెంట్ అందుతుండటంతో ప్రతి ఒక్కరు కూడా టిక్ టాక్ లోనే గంటలతరబడి కాలం గడిపారు. తర్వాత భద్రతాపరమైన కారణాల దృశ్య భారత్లో టిక్టాక్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పటికీ చాలా దేశాలలో టిక్టాక్ వినియోగం లోనే ఉంది.


 కాగా ఇటీవలే టిక్టాక్ ఒక అరుదైన రికార్డును సాధించింది.  ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ని వెనక్కి నెట్టేసింది టిక్టాక్. 2021 సంవత్సరంలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సైట్లలో మొదటిస్థానంలో టిక్టాక్ నిలవడం గమనార్హం. అమెరికాకు చెందిన సెర్చ్ ఇంజన్ గూగుల్ కంటే అధికంగా హిట్ లను అందుకుందని క్లౌడ్ ఫెర్ నివేదిక వెల్లడించింది. టిక్ టాక్ తర్వాత గూగుల్ 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. ఇక ఆ తర్వాత ఫేస్బుక్ మైక్రోసాఫ్ట్ యాపిల్ అమెజాన్ నెట్ ఫ్లిక్స్  యూట్యూబ్ వాట్సాప్ ఉన్నాయి అన్న విషయాన్ని నివేదికలో వెల్లడైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: