భారత్ కీలక ముందడుగు.. బ్రహ్మోస్ కోసం?

praveen
భారత రక్షణ రంగాన్ని పటిష్టవంతం చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం భారత ప్రభుత్వం ముందుకు సాగుతోంది.  ఈ క్రమంలోనే ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయడమే కాదు అటు స్వదేశంలో కూడా ఎంతో అధునాతనమైన ఆయుధాలను అభివృద్ధి చేస్తూ ఉండటం గమనార్హం. భారత రక్షణ రంగాన్ని పటిష్టవంతం చేయడాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తుంది భారత ప్రభుత్వం.. అయితే భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో కు పూర్తిస్థాయి నిధులు కేటాయించడంతో.. ఎప్పుడు వినూత్నమైన ఆయుధాలను తయారు చేస్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు.



 ఈ క్రమం లోనే ఇటీవల కాలం లో ఎన్నో అధునాతనమైన ఆయుధాలను తయారు చేసింది భారత ప్రభుత్వం. అదే  సమయంలో అగ్ర రాజ్యాలకు సైతం పోటీ ఇచ్చే విధంగా మరిన్ని ఆయుధాలు తయారు చేస్తూ ఉండటం గమనార్హం. అదే సమయం లో భవిష్యత్తు అవసరాల రీత్యా ఎన్నో రకాల ప్రయోగాలు కూడా చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇటీవల సూపర్ సోనిక్ మిస్సైల్స్ తయారీకి కూడా భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టడం గమనార్హం.. ఇప్పటికే బ్రహ్మోస్ లాంటి అద్భుతమైన మిసైల్ వ్యవస్థను కనుగొంది. అంతే కాదు సముద్రగర్భంలో కూడా యుద్ధం చేసే విధంగా అద్భుత టెక్నాలజీ వైపుగా కూడా పరిశోధనలు ప్రారంభించింది భారత్.


 దాదాపు గంటకు మూడున్నర వేల కిలో మీటర్ల తో దాడి చేసేటటువంటి సూపర్ సోనిక్ మిసైల్స్ ను  భారత శాస్త్రవేత్తలు ఇప్పటికే తయారు చేశారు. అయితే బ్రహ్మోస్, సూపర్ సోనిక్ క్షిపనులకు  సంబంధించి తాజాగా ఒక ప్రత్యేకమైన వ్యవస్థను స్థాపించినట్లు తెలుస్తోంది.. బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించింది. ఈ సంస్థకు కొత్త సీఈఓగా డి ఆర్ డి ఓ సైంటిస్ట్ అతుల్ దినకర్ రానే ను నియమించింది. కేంద్ర ప్రభుత్వం అనుకున్న మేకిన్ ఇండియా నినాదానికి ఇది ఒక కీలకమైన ముందడుగుగా రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: