జగన్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాల్యం ఎలా సాగింది ? ఎక్కడ సాగింది ? ఏ స్కూల్ లో చదివారు ? ఇలాంటి ప్రశ్నలు నిత్యనూతనంగా ఎప్పుడు వస్తుంటాయి. ఆయన తెలుగు మాట్లాడినా, ఇంగ్లీషులో ఉపన్యాసం చేసినా చాలా స్పష్టంగా ఉంటుందని పలువురు మెచ్చుకుంటుంటారు కూడా. ఇంతకీ ఆయనది ఏ స్కూల్ ?
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్యాభ్యాసం భాగ్యనగరంలో ఎక్కువ కాలం సాగింది. ఆయన చదువుకోనింది బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ . ఈ స్కూల్లో దాదాపు 500 మందికి పైగా సీఈవోలను ప్రపంచానికి అందించింది.
మైక్రో సాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల, అడాబ్ కంపెనీ సిఈఓ నారాయణ అజయ్ బంగా ఇలా రాసుకుంటూ పోతే ఎందరెందరో మహామహులు ఈ హెచ్ పి ఎస్ గా పిలువబడే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులే.
సినీ రంగ ప్రముఖులు అక్కినేని నాగార్జున కోబ్రా బీర్ సంస్థ వ్యవస్థాపకులు కిరణ్, విప్రో సంస్థ మాజీ సీఈఓ పీకే కురియన్, క్రికెట్ కామెంటేటర్ హరీష్, సుప్రీం కోర్టు న్యాయవాది గురు స్వామి కూడా ఈ స్కూల్ విద్యార్థులు. ఇక రాజకీయ రంగానికి వస్తే అవిభక్త ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంఐఎం నేత ఓవైసీ నేటి తరం సినీ ప్రముఖులు రామ్ చరణ్ దగ్గుబాటి రానా కూడా ఇక్కడి విద్యార్థులే.
ఇంతకీ ఈ పబ్లిక్ స్కూల్ ప్రత్యేకత ఏమిటి? ప్రతి స్కూల్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ విషయం ఎవరూ కాదన లేరు. అదే ప్రత్యేకత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కి ఉంది విద్యార్థులకు చిన్నప్పటినుంచే నాయకత్వ లక్షణాలు ఈ స్కూల్లో నేర్పిస్తారు. వ్యవసాయ రంగ అంశాలపై అవగాహన కల్పిస్తారు. చిన్నప్పటి నుంచే విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంపోందిస్తారు. సైనిక విభాగాల శిక్షణ తప్పని సరిగా ఉంటుంది. పోలీసు విధుల పై అవగాహన పెంచుతారు. బట్టీ పట్టే విధానానికి స్కూల్ చాలా దూరంగా ఉంటుంది స్కూల్ ని 1923లో ప్రారంభించారు ఏడో నిజాం నవాబు హయాంలో చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి అయితే ఇది 1951 తర్వాత స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గా రూపాంతరం చెందింది