ఇండియాలో ఆ రికార్డు జగన్ ఒక్కడికే సొంతం...!
2014 ఎన్నికల్లో జగన్ సాధారణ ఎన్నికల్లో ఓడిపోయినా ఐదేళ్ల పాటు ఎంతో కష్టపడి నిరంతరం ప్రజల్లోనే ఉండి పట్టుదలతో తిరిగి ఐదేళ్లలోనే అధికారంలోకి వచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అవడం ఒక ఎత్తు అయితే... దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని కేవలం 23 సీట్లకు పరిమితం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ తిరుగులేని విజయాలు నమోదు చేస్తోంది.
ప్రతిపక్ష పార్టీలు అన్నింటికీ కలిపి కూడా 5 శాతం విజయాలు కూడా దక్కని పరిస్థితి ఉంది. భారత దేశ రాజకీయ చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని అద్భుతమైన రికార్డులు జగన్ సొంతం చేసుకుంటున్నారు. సాధారణ ఎన్నికల తో మొదలైన జగన్ అప్రతిహత విజయ ప్రస్థానం సర్పంచ్ ఎన్నికలు - మున్సిపాలిటీలు - కార్పొరేషన్ ఎన్నికలు ఇలా వరుస పెట్టి ప్రతి ఎన్నికల్లోనూ వైసిపి తిరుగులేని విజయాలు నమోదు చేస్తోంది.
ఇలా తండ్రి ఒక పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయితే అదే పార్టీ నుంచి ముఖ్యమంత్రులు అయిన వారసులు ఎంతో మంది ఉన్నారు. అయితే వీరికి భిన్నంగా తండ్రి ముఖ్యమంత్రి అయిన పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్.. ఆ పార్టీతో విబేధించి కొత్త పార్టీ పెట్టుకున్న 8 ఏళ్ల కే ముఖ్యమంత్రి అవ్వడం మాత్రం అరుదు అయిన రికార్డుగా దేశ చరిత్రలో నిలిచి పోయింది.