ఆపరేషన్ ఆకర్ష్.. అన్ని పార్టీల లక్ష్యం ఎన్నికలేనా.. గెలుపెవరిది..!

MOHAN BABU
రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు నెలల వ్యవధి ఉన్నప్పటికీ అధికార టీఆర్ఎస్ తో బీజేపీ నేతలు తలపడేందుకు తీవ్ర కసరత్తు ముమ్మరం చేశారు.మరో పక్క రాష్ట్రంలో బీజేపీ నేతలను తిరగనీయొద్దంటు స్వయంగా కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇవ్వడంతో పాటు దాడులకు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ తీరుపై  బీజేపీ నేతలు మండి పడుతూనే పోరుకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి రావాలంటూ రాష్ట్ర బీజేపీ నేతలకు పిలుపు రావడంతో ఏం జరగబోతోందన్న చర్చ మొదలయింది. బండి సంజయ్ తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో అమిత్ షా 21న భేటీ కానున్నారు.ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న  తాజా రాజకీయ పరిస్థితులతో పాటు కేసీఆర్ బెదిరింపులు, దాడులను ప్రేరేపించే విధంగా చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. దాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందంటున్న నేతలు అమిత్ షా  వద్ద కూడా ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రతిదానికి వ్యూహాన్ని ఖరారు చేసేలా వ్యూహాన్ని సిద్ధంచేయాలని కూడా భావిస్తున్నారు.


 తొలినుంచీ టిఆర్ఎస్ ను ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో 2023లో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళుతుంది. కొద్ది రోజుల క్రితం బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ యాత్రకు ప్రజల నుంచి పార్టీకి ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. దీంతో రెండో విడత యాత్రకు సన్నద్ధమవుతున్నారు. ఇదే తరుణంలో అనుకోకుండా వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికతో బిజెపి ఉత్సాహం ఉరకలు వేస్తోంది. చేరికలు  కూడా పెరుగుతున్నాయి. ఉద్యమకారులు కొంత మంది ఇప్పటికే బీజేపీలో చేరారు. మరికొంత మంది సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం కూడా జోరందుకుంది. మంగళవారం జరగనున్న పార్టీ నేతల భేటీలో రాష్ట్రంలో రాజకీయాలు, కెసిఆర్ హింసను ప్రేరేపించేలా చేస్తున్న వ్యాఖ్యలతో పాటు రానున్న రెండేళ్ళ కాలంలో చేపట్టాల్సిన ఉద్యమాలపై చర్చించే అవకాశాలున్నాయని అంటున్నారు. అంతే కాకుండా ఆపరేషన్ ఆకర్ష్ ను మరింత ముమ్మరం చేయడంతో పాటు నేతలకు కీలక బాధ్యతలను కూడా అప్పగించవచ్చన్న చర్చ జోరందుకుంది. ప్రస్తుతం బిజెపి జాతీయ నాయకత్వం పూర్తిగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించింది. ఈ ఎన్నికలు పూర్తవగానే తెలంగాణపైనే ప్రత్యేక దృష్టి పెట్టనున్నందున ఇప్పటినుంచే కార్యాచరణకు శ్రీకారం చుట్టనుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: