చైనా కి షాక్.. పాకిస్తాన్ మొత్తం కదిలింది?
పాకిస్తాన్ లో ఎన్నో అరాచకాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే చైనా ఎన్ని అరాచకాలకు పాల్పడిన పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం దేశ ప్రజల ప్రయోజనాలను కూడా గాలికొదిలేసి దారుణంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఇక ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది.. ఈ క్రమంలోనే పాకిస్థాన్లోని గ్వాదర్ పోర్ట్ దగ్గర ప్రస్తుతం ఎంతోమంది ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధమైపోయారు. అయితే ఇక ఈ తిరుగుబాటును ఎలాగోలా అణచివేయాలని చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చైనా కు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.
గ్వాదర్ పోర్టు దగ్గర ప్రారంభమైన అటువంటి లక్షలాదిమంది ఉద్యమం ప్రస్తుతం 30వ రోజుకు చేరింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మొత్తం ఉద్యమాలు పెరిగిపోతూ ఉండటం గమనార్హం. మొన్నటి వరకు గ్వాదర్ పోర్ట్ ప్రజలే చైనా తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేయగా ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలందరూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్ పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రస్తుతం పాకిస్థాన్ చైనాకు బానిసగా మారుస్తున్నారని ఇలాంటి సమయంలో అటు గ్వాదర్ పోర్టులో ఉద్యమం చేపడుతున్న వారికి మద్దతు తెలుపక పోతే ఇక రానున్న రోజుల్లో పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదం ఉందని భావించి కొందరు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది.