తగ్గేదేలే.. పుల్వామా స్పెషలిస్ట్ ఖతం?

praveen
గత కొన్ని రోజుల నుంచి భారత ఆర్మీ సరిహద్దుల్లో ఎంత అప్రమత్తంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు భారత్లోకి వచ్చినప్పటికీ పై నుంచి ఆర్డర్స్ వచ్చేంతవరకు భారత సైనికులు వెయిట్ చేసేవారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం కమాండర్ స్థాయి అధికారులకు ఇక పూర్తి అనుమతులు ఇవ్వడం తో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు మట్టు పెడుతూనే ఉన్నారు.

 ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి భారత్ ఆర్మీ నిర్వహిస్తున్న వివిధ ఆపరేషన్స్ లో ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఎంతో మంది ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటికే వందల సంఖ్యలో ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేసింది భారత ఆర్మీ. అయితే భారత ఆర్మీ ఉగ్రవాదుల ఆటలు కట్టిస్తున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఉగ్రవాదులు మాత్రం భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలా చొరబాటు కోసం వినూత్నమైన దారులు వెతుకుతూనే ఉన్నారు. అయితే ప్రతి సవాల్ ను ఎదుర్కొంటూ భారత ఆర్మీ ఉగ్రవాదులను మట్టుబెడుతూ ఉంది.

 ఇటీవలే భారత ఆర్మీ మరో భారీ ఎన్కౌంటర్ చేసినట్లు  తెలుస్తోంది. గతంలో సైన్యం మీద పుల్వామాలో ఎంత దారుణమైన దాడి జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దాడిలో ఎంతో మంది జవాన్లు అమరులయ్యారు. ఇటీవలే వేదికగా పోలీసులపై ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే ఇక ఈ దాడులకు కారణమైన ఇటువంటి కీలకమైన సూత్రధారి ఎవరు అన్నది భారత ఆర్మీ కనుగొంది. ఈ క్రమంలోనే ఇక ఎలిటీ సంస్థకు సంబంధించి నటువంటి అబూ జరార్ అనే టెర్రరిస్ట్ ని  ఇటీవలి భారత ఆర్మీ ప్రత్యేకమైన ఆపరేషన్ నిర్వహించి ఎన్కౌంటర్లో చంపేసింది. ఇక ఇదే ఘటనలో మరో తీవ్రవాద సంస్థకు సంబంధించిన కమాండర్ ను కూడా భారత్ ఆర్మీ మట్టుబెట్టిన ట్లు  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: