యూపీలో త్రిషూల వ్యూహం.. మోడీ ప్లాన్, యోగి ఆచరణ?
ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సారి అధికారం లోకి వచ్చిన పార్టీ రెండవ సారి గెలవడం మాత్రం ఇప్పటి వరకు చరిత్ర లో జరగలేదు. ఈ క్రమం లోనే అటు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి ప్రస్తుతం స్వయంగా మోడీ రంగం లోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఉత్తరప్రదేశ్లో ఏకంగా మూడంచల వ్యూహాన్ని నరేంద్ర మోడీ అమలు చేస్తూ ఉండటం గమనార్హం. ఒకవైపు నేరాలను అరికట్టే... రౌడీ ఇజాన్ని పూర్తిగా తగ్గిస్తున్నారు. ఇలా యూపీలో నేర చరిత్రను తగ్గిస్తున్నారు. శాంతిభద్రతల నియంత్రణ నివారణ చేస్తుంది.
ఇక మరోవైపు మతపరమైన అటువంటి ఏకీకరణ విధానం తో ముందుకు సాగుతోంది బిజెపి ప్రభుత్వం. తద్వారా ఎంతో మంది ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. ఇక మూడవది యూపీలో అభివృద్ధిని చేసి ఇక ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం. ఈ క్రమం లోనే ఇప్పటికే యూపీలో ఎన్నో రకాల సంస్థల ను స్థాపించింది బిజెపి. ఇవన్నీ యోగి చేస్తుండగా యోగిని వెనకుండి నడిప్పిస్తున్నాడు మోడీ. ఇలా ఎన్నో విదేశీ కంపెనిలను ఆకర్శించటమే కాదు.. ఎన్నో ఆయుధ తయారీ కంపనీ లను స్థాపిస్తూ ఉపాధి కల్పిస్తుంది యూపీ ప్రభుత్వం.