
ఇప్పుడు ఎన్నికలు జరిగితే గుంటూరులో టీడీపీ గెలిచే 13 సీట్లు ఇవే..!
ఇక రాజధాని అమరావతి జిల్లా అయిన గుంటూరు లో వైసిపికి అప్పుడే తీవ్రమైన వ్యతిరేకత పరిస్థితి కనిపిస్తోంది. అమరావతిని వికేంద్రీకరించి... ఎప్పుడు అయితే జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు ప్రకటించిం దో... అప్పుడే జిల్లా ప్రజల్లో వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్న బలమైన కసి వచ్చేసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకే వారంతా వైసీపీకి ఓటు వేశారు... కానీ సాధారణ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి చావు దెబ్బ రుచి చూపించాలని ఉన్నారు.
ఈ క్రమంలోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమకు జిల్లాలో ఉన్న 17 ఎమ్మెల్యే సీట్లలో 13 సీట్లలో తిరుగులేని విజయాలు నమోదు అవుతాయి అని తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పల్నాడు లో ఉన్న నరసరావుపేట నియోజకవర్గం తో పాటు మాచర్ల నియోజకవర్గంలో తమకు ఇప్పటికీ అనుకూలమైన పరిస్థితులు లేవని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికితోడు గుంటూరు తూర్పు నియోజకవర్గం లోనూ కష్టపడాల్సి ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది. ఇప్పుడు మారిన పరిస్థితు ల నేపథ్యంలో అక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించితే తాము గెలుస్తామని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నాలుగు సీట్లు మినహా జిల్లాలో ఉన్న మిగిలిన 13 సీట్లలో తెలుగుదేశం పార్టీ తిరుగులేకుండా విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.