న‌ల్ల‌గొండ లో ఆ టాప్ లీడ‌ర్ కాంగ్రెస్ లోకే..?

VUYYURU SUBHASH
ఉమ్మడి నల్గొండ జిల్లా కు చెందిన కీలక రాజకీయ నేత , యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా ? అధికార టీఆర్ఎస్ పార్టీ తో పోరాటం చేసేందుకు తన బలం సరిపోవడం లేదని భావిస్తున్న ఆయన... ఇప్పు డు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నారా ? అంటే భువనగిరి నియోజకవర్గంలో అవును అన్న చర్చలు వినిపిస్తున్నాయి .

బాలకృష్ణారెడ్డి ఒకప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉండేవా రు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన గట్టిగా పోరాటం చేశారు. అయితే కేసీఆర్ జిట్టా బాలకృష్ణ రెడ్డి కి సీటు ఇవ్వలేదు. అప్పుడు కేసీఆర్ తో విభేదించి బయటకు వచ్చిన బాలకృష్ణా రెడ్డి వరుసగా మూడు సార్లు భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నే రెండు సార్లు రెండో స్థానంలో నిలిచిన ఆయన... ఒకసారి మూడో స్థానంలో నిలిచారు.

2009 ఎన్నికల్లో అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఉమా మాధవ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 - 2018 ఎన్నికల్లో వరుసగా టిఆర్ఎస్ నుంచి పైళ్ల‌ శేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గెలుస్తూ వస్తున్నారు. ఈ మూడు సార్లు కూడా గట్టిపోటీ ఇచ్చినా కూడా విజయం సాధించలేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

భువ‌న‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో ఆయ‌న ది రెండు ద‌శాబ్దాల అనుబంధం. అక్క‌డ ఆయ‌న‌కు పార్టీల‌తో సంబంధం లేకుండా సొంత ఓటు బ్యాంకు ఉంది. జిట్టా బాలక్రిష్ణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి భువనగిరి నుంచి పోటీ చేస్తే ... భువనగిరిలో ఆ పార్టీకి కొత్త ఊపు వస్తుంది అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: