రేవంత్-ఉత్తమ్-కోమటిరెడ్డిలు మళ్ళీ రివర్స్ అవుతారా?
ఇక టీఆర్ఎస్ వ్యూహాలు ఫెయిల్ అవ్వలేదు...రేవంత్, కోమటిరెడ్డి విషయంలో సక్సెస్ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్ రెడ్డి, నల్గొండ అసెంబ్లీలో కోమటిరెడ్డిని ఓడించింది. కాకపోతే హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెక్ పెట్టలేకపోయింది. అయితే అసెంబ్లీలో ఓడిన రేవంత్, కోమటిరెడ్డి అనూహ్యంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో దిగారు. రేవంత్ ఏమో మల్కాజిగిరి ఎంపీగా, కోమటిరెడ్డి...భువనగిరి ఎంపీగా పోటీ చేశారు. అటు ఉత్తమ్..నల్గొండ ఎంపీగా పోటీ చేశారు. అయితే ఈ ముగ్గురు నేతలు ఎంపీలుగా గెలిచేశారు.
అయితే ఎంపీగా గెలిచాక ఉత్తమ్...హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి ఉపఎన్నిక రావడం...ఆ ఉపఎన్నికలో ఉత్తమ్ భార్య పద్మావతి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి చేతిలో ఓడిపోవడం జరిగాయి. అంటే ఈ ముగ్గురు కాంగ్రెస్ బడా నేతలు అసెంబ్లీ స్థానాల పరిధిలో చావుదెబ్బ తిన్నారు.
ఇలా చావుదెబ్బ తిన్న ఈ ముగ్గురు నేతలు..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ అవే స్థానాల నుంచి పోటీ చేస్తారా? లేక ఎంపీలుగా బరిలో దిగుతారా? అంటే ఖచ్చితంగా ఈ ముగ్గురు అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. రేవంత్ రెడ్డి..మళ్ళీ కొండగల్‌లో, కోమటిరెడ్డి..నల్గొండ అసెంబ్లీలో, ఉత్తమ్..హుజూర్‌నగర్ స్థానంలో పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. ఈ సారి మాత్రం ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో ఈ ముగ్గురు నేతలు పనిచేస్తున్నారు. ఏ మాత్రం టీఆర్ఎస్ పార్టీకి ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నారు. మొత్తానికైతే ఈ బడా నేతలు మళ్ళీ తమ సొంత స్థానాల్లోనే పోటీ చేయడం ఖాయమే.