రంగంలోకి దిగిన మోడీ.. చరిత్ర సృష్టిస్తారా?

praveen
2014కు ముందు వరకు ఉత్తర ప్రదేశ్ లో బిజెపి ఎంతో బలహీనంగా ఉంది. ఎన్ని సార్లు పోటీ చేసిన అనుకున్నంత స్థాయిలో మెజారిటీ మాత్రం సాధించలేకపోయింది. కానీ ఎవరూ ఊహించని విధంగా 2014 లో జరిగిన ఎన్నికల్లో అనూహ్యమైన విజయాన్ని సాధించింది బిజెపి. 2014 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారీ స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఆ తర్వాత 2016 లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీ విజయం సాధించి చివరికి అధికారాన్ని చేపట్టింది బిజెపి.


 ఇలా ఇక 2016లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత యూపీలో బిజెపి ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి. ఇక 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బిజెపి పట్టు కోల్పోతుంది అని ప్రచారం జరిగినప్పటికీ ఇక 2019 పార్లమెంటు ఎన్నికల్లో కూడా అద్భుత విజయాన్ని సాధించింది బిజెపి. వచ్చే ఏడాది మరో సారి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు వరకు ఒకసారి అధికారంలో కొనసాగిన పార్టీ మళ్ళీ జరిగిన ఎన్నికల్లో రెండవసారి విజయం సాధించిన దాఖలాలు లేవు.



 ఒకవేళ ఇక వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి మళ్ళీ విజయాన్ని సాధించింది అంటే యూపీ రాజకీయాల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించినట్లు అవుతుంది.  ఈ క్రమంలోనే  యూపీ ప్రజలందరినీ కూడా ఆకర్షించేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గత కొంత కాలం నుంచి ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడం.. ఎన్నో దేవాలయాలను ప్రారంభించడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇలా యూపీ ప్రజలను ఆకర్షించేందుకు ఈ రకంగా అడుగులు వేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచి చరిత్ర సృష్టిస్తుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: