ఏపీ ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరమా.. కేంద్ర మంత్రి సంచలనం
ఏపీకి సంబంధించి మార్చి 31తో ముగిసిన 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ నివేదిక గురించి మాట్లాడిన ఆమె ఏపీ ప్రభుత్వ వైఫల్యాన్ని నిర్మొహ మాటంగా బయట పెట్టేశారు. బీజేపీ ఎంపీ ఒకరు రాజ్యసభ లో వేసిన ప్రశ్నకు ఆమె ఈ ఆన్సర్ ఇచ్చారు. 2015-16తో పోలి చూస్తే 2016-17 లో రెవెన్యూ లోటు పెరగటానికి ప్రధాన కారణాన్ని కూడా ఆమె చెప్పారు. ఉదయ్ స్కీం మార్గదర్శ కాల ప్రకారం డిస్కంల రుణాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని.. ఖర్చు చేయడమే అని చెప్పారు.
ఇక 2019 - 20 వ సంవత్సరం లో కూడా ఏపీ రెవెన్యూ లోటు పెరగడానికి సంక్షేమ పథకాలే ప్రధాన కారణం అని కూడా ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన అమ్మఒడి.. ఉచిత విద్యుత్తు లాంటి పథకాల తో లోటు బాగా పెరిగి పోయిందని ఆమె తెలిపారు. ఇక 2014 లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి పన్నుల వాటాలో నే కేంద్రం రూ.4.40 లక్షల కోట్ల ఆర్థిక వనరుల్ని అందించామని నిర్మల చెప్పారు.
ఇక 2014 లో రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఏపీకి కేంద్రం నుంచి మొత్తంగా రూ.440985కోట్ల మొత్తం వచ్చాయని ఆమె తెలిపారు.