కోర్టు వద్దన్న ప్రతిసారీ వైసీపీకి కోపం వస్తుంది. అలాంటి కోపం సహజం.. దానిని ఎవ్వరూ కాదనరు కానీ టికెట్ రేట్లపై ప్రభుత్వం చూపిన జాలీ దయ మిగతా రేట్లను నియంత్రించడంలోనూ ఉంటే ఎంత బాగుండేది. కానీ ఆ పని జగన్ సర్కారు ఎందుకనో చేయడం లేదు. ఫలితంగా ప్రతి విషయమై కోర్టులే జోక్యం చేసుకుని ఏది మంచో ఏది చెడో చెప్పాల్సి వస్తోంది. తాజాగా సినిమా టికెట్ రేట్ల పెంపు అన్నది పాత విధానం ప్రకారమే సాగిపోవాలని ఆ నిర్ణయం డిస్ట్రిబ్యూటర్లే తీసుకోవాలని ఆ విధంగా పెంపుపై వారికి వెసులుబాటు ఉందని పేర్కొంటూ కోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ మళ్లీ అంతర్మథనం చెందుతోంది.
రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవడంలో వైసీపీ చాలా అంటే చాలా ముందుంటుంది. డబ్బుల్లేక పోయినా, ప్రభుత్వాన్ని సక్రమంగా నడపలేకపోయి నా బాధ అయితే ఉండదు కానీ ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని మాట్లాడడంలో, నిర్ణయా లు తీసుకోవడంలో ముందుంటుంది. దీంతో జగన్ కు ఓ విధంగా ఆనందం పుడుతుంది. అంతేకాదు ఆయనదే పై చేయి అయి ఉంటుంది కూడా ఆయా సందర్భాల్లో! వకీల్ సాబ్ సినిమా విషయంలో కూడా ఇలానే ఆనందించి ఉంటారు జగన్. ఉన్నట్టుండి టికెట్ రేట్లు తగ్గించి అందరినీ ఆశ్చర్యపరిచిన జగన్ తరువాత అదే నిర్ణయాలను కొనసాగించి జీఓలు ఇచ్చి హాయిగా మరో సారి నవ్వుకున్నారు. కానీ ఆ రోజు ఆయన నిర్ణయాలను బాహాటంగా వ్యతిరేకించిన పవన్ పై ఇండస్ట్రీ గుర్రుగా ఉంది.
అంతేకాదు ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పోయి అలా మాట్లాడడం తగదని హితవు చెప్పింది. కానీ ఈరోజు పేర్ని నాని చెప్పిన విధంగానో జగన్ కోరుకున్న విధంగానో నిర్ణయం వెలువడ లేదు. కోర్టు జీఓ నంబర్ 35ను రద్దు చేసింది. థియేటర్ల దగ్గర టికెట్ రేట్లు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టింది. దీంతో జగన్ అండ్ కో మళ్లీ డైలమాలో పడిపోయారు. ఆ విధంగా జగన్ మళ్లీ కోర్టు దగ్గర ఓడిపోయారు. జగన్ జనం దగ్గర కూడా ఓడిపోయారు.