ఇక అలాంటి సినిమాలు చేయొద్దని డిసైడ్ అయ్యా.. హీరో సిద్ధార్థ్ కామెంట్స్?
అసలు విషయంలోకి వెళ్తే, సిద్ధార్థ హీరోగా, ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో తమిళ అనువాదం "మిస్ యు" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. దాంతో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు సదరు చిత్ర యూనిట్ తాజాగా హైదరాబాదులో నిర్వహించగా హీరో సిద్ధార్థ ఈ సందర్భంగా, చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇకముందు గాని, ఇప్పుడు గాని ఆయన లవ్ స్టోరీ కు సంబంధించిన సినిమాలు అస్సలు చేయనని, కేవలం క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలను మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ... నేను స్టార్ హీరోని కాదని, ఒక నటుడిగా మాత్రమే నన్ను ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటానని చెప్పుకొచ్చాడు. ఒక మంచి నటుడిగా ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుకుంటానని, అంతకు మించిన పెద్ద కోరికలు లేవని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఒక తెలంగాణ అల్లుడుగా హైదరాబాదు వచ్చానని, హీరోయిన్ అతిధి హైదరీని పెళ్లి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా వెల్లడించాడు హీరో సిద్ధార్థ్.