రిలాక్స్ మోడ్ లోకి ఐకాన్ స్టార్.. త్రివిక్రమ్ ఇంకొన్నాళ్ళు ఎదురుచూడాల్సిందేనా..?

murali krishna
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2 సినిమా విడుదల టైమ్ దగ్గర పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు అన్ని పూర్తి అయ్యాయి. అయితే ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి అవుతుంది. ఆ తరువాత ఈ సినిమా సెన్సార్‌ కి వెళ్లబోతుంది. ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో కష్టపడ్డారు. ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్‌ అయితే ప్రాణం పెట్టేస్తున్నాడానే చెప్పాలి. రోజులో 20 గంటలు పుష్ప 2 సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ పనులు చూసుకుంటున్నారని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు కూడా ఈ సినిమా షూటింగ్‌తో సుకుమార్‌ బాగా బిజీగా ఉన్నారు.ఇదిలావుండగా అటు అల్లుఅర్జున్ కూడా డే అండ్ నైట్ షూటింగ్‌తో కష్టపడుతున్నారు. ఈ క్రమంలో అల్లుఅర్జున్ ఫ్యామిలీ కోసం బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. ఆరు నెలల పాటు ఫ్యామిలీతో టూర్లకు వెళ్లి రిలాక్స్ కావాలని ప్లాన్ చేస్తున్నాడట. 
ఈలోపు త్రివిక్రమ్ స్టోరీ వర్క్ కూడా కంప్లీట్ అవుతుందని అంటున్నారు.ఇలా పుష్ప-2 షూటింగ్ స్టార్ట్‌ అయినప్పటి నుంచి నాన్ స్టాప్‌గా వర్క్ చేస్తూ వస్తున్నాడు అల్లు అర్జున్. దాదాపు 2 వేల కోట్ల టార్గెట్ పెట్టుకున్న బన్నీ దానికి తగ్గట్టు కష్టపడుతున్నాడు. ఇక సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 5న పుష్ప-2 రిలీజ్‌ తర్వాత కూడా 20 రోజుల పాటు ప్రమోషన్స్, ప్రెస్ మీట్లు, ఇంటర్య్యూలతో బిజీగా గడపనున్నాడు బన్నీ. ఇక న్యూఇయర్ జనవరి నుంచి దాదాపు 6 నెలలు పాటు బిగ్ బ్రేక్ తీసుకోబోతున్నాడని టాక్.ఇదిలావుండగా పుష్ప-2 రిలీజ్ తర్వాత ఆరు నెలల పాటు రెస్ట్‌ తీసుకుని త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో పెద్ద మూవీ చేయబోతున్నాడని అంటున్నారు. ఇది మైథాలజికల్ మూవీ అని కొందరు హిస్టారికల్ మూవీ అని ఇంకొందరు చెబుతున్నారు.అయితే త్రివిక్రమ్ అల్లుఅర్జున్ కోసం ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయక తప్పదంటు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: