అంతా నా ఇష్టం అంటూ తన ఇష్టారీతిన సినిమాలు తీస్తూ ఎంతోమందిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్న ఆర్జీవికి కష్ట కాలం మొదలైంది. తమకు అనుకూల పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తన కి నచ్చని పార్టీపై ఎన్నో సినిమాలు తీసి వారిని వ్యక్తిగతంగా విమర్శించారు.వారి మనోభావాలు దెబ్బతీసేలా వారిని సినిమాల్లో చూపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్,చంద్రబాబు వంటి రాజకీయ నాయకుల క్యారెక్టర్ లకు తగ్గట్టుగా ఉండే ఆర్టిస్టులను తీసుకువచ్చి సినిమాల్లో చూపించేవారు. అంతేకాదు సినిమా విడుదలకు ముందు జరిగే ఈవెంట్లలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి విపక్ష నేతలపై నోరు పారేసుకున్నారు. అయితే అప్పుడు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆయనకి అనుకూలంగా ఉన్న పార్టీ అధికారంలో లేదు.ప్రస్తుతం ఏపీలో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఎవరైతే తమను వ్యక్తిగతంగా దూషించారో వారిపై కొరడా జులిపిస్తున్నారు. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి నేతలపై అణుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్జీవి పై నెల రోజుల క్రితం మద్దిపాడు లో పోలీస్ కేసు నమోదయింది.
కానీ ఈ కేసు నుండి తప్పించుకోవడానికి ఆర్జీవి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఒంగోలు పోలీసులు నవంబర్ 19న విచారణకు హాజరు అవ్వాలని ఆర్జివికి నోటీసులు పంపగా హైకోర్టులో క్వాష్ ఫిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆయన హైకోర్టులో వేసిన పిటిషన్ ని హైకోర్టు రిజెక్ట్ చేయడంతో పోలీసుల ఎదట హాజరవ వలసి ఉంది. కానీ ఈయనను దర్యాప్తు చేసే అధికారికి నేరుగా ఆర్జీవి వాట్సాప్ మెసేజ్ పెట్టి నేను ప్రస్తుతం సినిమా షూటింగ్లో ఉన్నాను. ఈ షూటింగ్ నుండి తప్పుకుంటే నిర్మాతకు నష్టం వస్తుంది.తర్వాత నేనే వచ్చి మీకు సహకరిస్తాను అని మెసేజ్ పెట్టారు. కానీ రిప్లై ఇవ్వకపోవడంతో ఆయన న్యాయవాదితో లెటర్ రాయించారు.కానీ దాన్ని కూడా పోలీసులు తిరస్కరించారు. ఇక నవంబర్ 19న గడువు అడగడంతో నవంబర్ 25 కి పోలీసులు డేట్ మార్చారు. కానీ నవంబర్ 25న కూడా పోలీసులకు చిక్కకుండా వర్మ తప్పించుకొని తిరుగుతున్నారు.
తన నివాసంలోనే ఉన్నాను అని చెప్పి పోలీసులు తీరా నివాసానికి వెళ్లి చూడగా ఆర్జీవి లేకపోవడంతో ఆయన పారిపోయారని పోలీసులు అర్థం చేసుకున్నారు. దాంతో ఆర్జీవిని వెతకడానికి తమిళనాడు, హైదరాబాద్ మొత్తం పోలీసులు గాలిస్తున్నారు.ఇక ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకోవడంతో ఆర్జీవిని పోలీసులు వెతుకుతున్నారు.అయితే ఈ మొత్తం డ్రామా ఎలా ఉంది అంటే 1997లో ఆర్జీవి తెరకెక్కించిన దౌడ్ సినిమాలాగే ఉంది.ఆ సినిమా ఎలా అయితే ఉందో ఇప్పుడు ఆర్జీవి కూడా ఆ సినిమాలో లాగే తప్పించుకొని తిరుగుతున్నారు అని జనాలు అంటున్నారు. ఇక ఆర్జీవి కోయంబత్తూర్ లోని శ్రీరెడ్డి ఇంట్లో ఉన్నారని కొంతమంది అంటే మరి కొంతమందేమో నటుడు మోహన్‌లాల్ ఇంట్లో తలదాచుకున్నారని అంటున్నారు. కానీ ఆర్జీవి ఎక్కడ ఉన్నారో మాత్రం తెలియడం లేదు