ఎల్ఐసి పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇక ఆ చింత అవసరం లేదు?
వ్యక్తిగత పెన్షన్ ప్లాన్ కలిగివున్న పెన్షనర్లు, ఎల్ఐసి స్టాఫ్ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ ను ఆన్లైన్లో పొందేందుకు అవకాశం కల్పిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది ఎల్ఐసి. అయితే ఇప్పటివరకూ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఎల్ఐసి బ్రాంచ్ ను సందర్శించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి అవసరం లేదు అంటూ ఎల్ఐసి సంస్థ తెలిపింది.ఎల్ఐసి జీవన్ సాక్ష అనే మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సులభంగా ఎల్ ఐ సి లైఫ్ సర్టిఫికెట్ పొందవచ్చు అంటూ తెలిపింది సంస్థ. ఇక సకాలంలో పెన్షన్ పొందడానికి పెన్షనర్లు ప్రతియేటా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది అన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది.
అయితే కరోనా వైరస్ సమయంలో ఎంతో మంది పెన్షనర్లు ఎల్ఐసి కార్యాలయాలకు తిరగడానికి కాస్త భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఎల్ఐసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్ఐసి జీవన్ సాక్ష్య యాప్ ద్వారా సర్టిఫికెట్ పొందడానికి ఇలా చేస్తే సరిపోతుంది.
1. మీ మొబైల్లో ఎల్ఐసీ జీవన్ సాక్ష్య యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. జీవన్ సాక్ష్య యాప్‌లో మీ ఆధార్ కార్డ్, పాలసీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
3. మొబైల్ తో సెల్ఫీ దిగి సబ్మిట్ చేయాలి.
4. వెంటనే మీ ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను ఎంతో సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.