తెనాలిలో ట్విస్ట్‌లు: టీడీపీ-జనసేన కలవకపోతే కష్టమే!
1994, 1999 ఎన్నికల్లో టీడీపీ, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 2014లో టీడీపీ, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అంటే తెనాలిలో గెలిచిన పార్టీ...రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. అంటే రాష్ట్రంలో ఏ పార్టీ హవా ఉందో తెనాలి ప్రజలు బట్టి అర్ధమైపోతుందనే చెప్పాలి. అయితే ఈ సారి మాత్రం కాస్త తెనాలిలో ట్విస్ట్‌లు వచ్చేలా ఉన్నాయి. ఎందుకంటే ఈ సారి ఈక్వేషన్స్ మారేలా ఉన్నాయి.
అవి ఎలా అంటే..ఒకవేళ టీడీపీ-జనసేన గానీ పొత్తులో పోటీ చేస్తే...తెనాలిలో వైసీపీ గెలవడం కష్టం. అలా కాకుండా ఆ రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే వైసీపీ గెలుపు సులువు. ఎందుకంటే ఇక్కడ జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు కాస్త పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఆయనకు 30 వేల ఓట్లు వచ్చాయి. కానీ ఇక్కడ టీడీపీ ఓడిపోయింది 17 వేల ఓట్ల తేడాతో..అంటే టీడీపీ-జనసేనలు కలిస్తే...వైసీపీకి చెక్ పడిపోతుందని చెప్పొచ్చు. కలకవపోతే వైసీపీకే బెనిఫిట్.
అయితే నెక్స్ట్ టీడీపీ-జనసేనలు పొత్తులో ఉంటే..ఏ పార్టీకి తెనాలి సీటు దక్కుతుందనేది కూడా ఆసక్తికరంగానే ఉంది. మామూలుగా తెనాలి టీడీపీ కంచుకోట కాబట్టి..ఆ పార్టీ సీటు వదులుకోదు...ఇటు నాదెండ్లకు కూడా నియోజకవర్గంపై పట్టు ఉంది...ఆయన కూడా సీటు వదులుకోరు. మరి పొత్తు ఉంటే సీటు ఎవరు దక్కుతుందో తెలియదు. కానీ ఏదేమైనా పొత్తు ఉంటేనే మాత్రం తెనాలిలో వైసీపీని ఓడించగలరు.