ఆఫీస్ లోకి వచ్చిన అరుదైన పాము.. చివరికి?
అయితే సాధారణంగా పరిసరప్రాంతాలలో తరచూ కొన్ని రకాల పాములు కనిపిస్తూ ఉంటాయి. ఇక అలాంటి పాములను చూసీ చూడనట్లుగానే వదిలేసి ఉంటారు జనాలు. కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం ఎంతో అరుదైన పాములు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి అరుదైన పాములు కనిపించినప్పుడు ఆశ్చర్యపోవడం చూసిన జనాల వంతు అవుతుంది. ఇక్కడ ఇలాంటి ఒక అరుదైన పాము కొంత మంది వ్యక్తులకు తారసపడింది. ఇక ఈ పామును చూడ్డానికి ఎంతో మంది జనాలు కూడా తరలివచ్చారు. వెంటనే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేయడంతో ఇక అరుదైన పాము పట్టుకున్న అధికారులు అడవిలో వదిలేశారు
ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఈ అరుదైన పాము దర్శనమిచ్చింది. ఆలివ్ కిలో బాక్ స్నేక్ అని పిలువబడే అరుదైన పాము మల్కాపురం ఫారెస్ట్ లో దర్శనమిచ్చింది. అయితే ఇక ఈ పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు నల్లమల ఫారెస్ట్ లో వదిలేశారు. ఈ అరుదైన పాము ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతాల్లో మాత్రమే ఉంటుందని ఇలా మైదాన ప్రాంతంలోకి రావడం చాలా అరుదు అని చెబుతున్నారు అధికారులు. ఇది విషపూరితమైన పాము కాదని ఎలాంటి ప్రమాదం ఉండదు అంటూ చెబుతున్నారు.