వైసీపీ పోలవరం ఫెయిల్యూర్‌ను కేంద్రంపై తోస్తోందా..?

Chakravarthi Kalyan
పోలవరం.. ఏపీలో ఓ అతి ముఖ్యమైన అంశం.. రాష్ట్రం విడిపోయేటప్పుడు కూడా ఏపీకి పరిహారంగా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారు. అయితే.. 2014 నుంచి పోలవరం నిర్మాణం ప్రక్రియ అంత జోరుగా సాగడం లేదు. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు కావస్తున్నా.. పోలవరం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. చంద్రబాబు హయాంలో పోలవరం నిర్మాణం మేం వేగంగా చేస్తాం అంటూ కేంద్రం నుంచి నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అన్నట్టుగా చంద్రబాబు హయాంలో పోలవరం వేగంగా నిర్మాణం సాగుతోంది అన్న ప్రచారం మాత్రం బాగా సాగింది.

అయితే చంద్రబాబు సర్కారు కేవలం ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టింది తప్ప.. కీలకమైన పునరావసం, పరిహారం ప్యాకేజీలను పెండింగ్‌లో పెట్టిందన్న వాదనలు ఉన్నాయి. ఏదేమైనా చంద్రబాబు ప్రతి వారం పోలవరం నిర్మాణంపై సమీక్షలు చేస్తూ కాస్త హడావిడి చేసేవారు. కానీ.. జగన్ సీఎం అయ్యాక.. ఆ హడావిడి తగ్గింది. అలాగే నిర్మాణం జోరు కూడా తగ్గిందన్న ప్రచారం ఉంది. 2021 నాటికి పోలవరం కట్టి చూపిస్తామంటూ గతంలో మంత్రి అనిల్ చేసిన వ్యాఖ్యల వీడియోలను ఇప్పుడు టీడీపీ ట్రోల్ చేస్తోంది. వాటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఏమైంది పోలవరం అని ప్రశ్నిస్తోంది.

అయితే ఇప్పుడు వైసీపీ సర్కారు.. ఈ ఆలస్యానికి కేంద్రానికి కారణం అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ విమర్శల ఘాటు ఇంకాస్త పెంచింది. పోలవరం జాతీయ ప్రా‍జెక్టు కాబట్టి.. దీని బాధ్యత కేంద్రానికే ఎక్కువ ఉంటుందని ఆ పార్టీ ఎంపీ పిల్లు సుభాష్ చంద్రబోస్ పార్లమెంట్‌ వద్ద స్పష్టం చేశారు. పోలవరం సవరించిన అంచనాలు రూ.55 వేల కోట్లను కేంద్రం ఆమోదించాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. ఏపీపై  కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఎంపీ సుభాష్ విమర్శించారు. అంతే కాదు.. పోలవరం హెడ్‌ క్వార్టర్స్‌ను రాజమండ్రికి మార్చాలని ఎంపీ పిల్లి సుభాష్ డిమాండ్‌ చేశారు. పోలవరం బకాయయిలను కేం‍ద్రం తక్షమే విడుదల చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తం మీద పోలవరం ఫెయిల్యూర్‌ లో కేంద్రం బాధ్యతే ఎక్కువ అని చెప్పే ప్రయత్నం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: