యూపీలో గెలిచేది ఆ పార్టీయే...?

Satya
దేశంలో యూపీ. ఇపుడు బీపీని పెంచేస్తోంది. జాతీయ పార్టీలను, ప్రాంతీయ పార్టీలను కూడా హడలెత్తిస్తోంది. ఎందుకంటే యూపీ అతి పెద్ద రాష్ట్రం. అక్కడ రాజకీయం అనుకూలంగా ఎవరికి ఉంటుందో వారే 2024 లో జరిగే దేశ సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజేతలు అవుతారు.
మరి ఈ సందేశం అర్ధం కాబట్టే అంతా యూపీ కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఇంతకీ యూపీ జనం ఏమనుకుంటున్నారు. మరో నాలుగు నెలలలో జరిగే ఎన్నికల్లో వారి ఓటు ఎటు, వారి తీర్పు ఎలా ఉంటుంది అన్నదే పెద్ద చర్చగా ఉంది. సర్వేల మీద సర్వేలు ఒక వైపు జరుగుతున్నాయి. అయినా కూడా రాజకీయ పార్టీలకు టెన్షన్ అంతకంతకు పెరిగిపోతోంది.
ఇప్పటిదాకా వచ్చిన పలు సర్వేలు చెప్పిన సారాంశం ఏంటి అంటే యూపీలో బీజేపీ బాగా తగ్గుతోంది అనే. అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీ బాగా పుంజుకుంటోంది అని. ఎస్పీ పుంజుకుంటే దెబ్బ పడేది బీజేపీకే. ఆ పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన సీట్లూ ఓట్లకు రెట్టింపు బలాన్ని ఈసారి సంపాందించుకుంటోంది అంటున్నారు. అయితే అదే సమయంలో అధికారానికి ఆమడ దూరంలోనే ఈ రోజుకీ ఎస్పీ ఉండడం బీజేపీకి కొంత ఆశలను పెంచుతోంది.
ఇంకో వైపు చూసుకుంటే బీజేపీ ఎంత చెడ్డా మరోసారి అధికారంలోకి రావడానికి అవసరం అయిన సీట్లను తెచ్చుకుంటుంది అన్న అంచనాలను కూడా ఈ సర్వే ఫలితాలు తెలియచేస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా వచ్చిన ఒక సర్వే అయితే యూపీ ముఖ్యమంత్రిగా యోగీకే మంచి మార్కులు వేసింది. ఆయనకు 40 శాతానికి పైగా ఓటింగ్ వస్తే 31 శాతంతో అఖిలేష్ యాదవ్ ఉన్నారు. అంటే తేడా కొంచెం తక్కువ అయినా కూడా ఈ రోజుకీ యోగీ పట్లనే జనాలు ఆదరణ కనబరుస్తున్నారు అని అర్ధమవుతోంది.
అయితే ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలకు పైగా టైమ్ ఉంది. కాబట్టి ఈ లోగా ఎన్ని మార్పులు వస్తాయో. ఏది ఏమైనా యోగీ మరో సారి బీజేపీని అధికారంలోకి తెస్తే మాత్రం గ్రేట్ అనుకోవాలి. ఈ రోజుకి ఆయనే ముఖ్యమంత్రి. ఈ రోజు వరకూ ఉన్న సర్వేల్లో కూడా ఆయన ఫ్యూచర్ సీఎం. సో ప్రస్తుతానికి బీజేపీ ఫుల్ హ్యాపీ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: