విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్..!
మరోవైపు విద్యాసంస్థల్లో కరోనా కేసులు వస్తున్న కారణంగా.. తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కొన్ని హాస్టళ్లలోనే కేసులు వస్తున్నాయనీ.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. కరోనా కేసులు ఎక్కువగా వస్తే ప్రభుత్వం సమీక్షిస్తుందని.. అప్పుడు విద్యాసంస్థలై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
అంతేకాదు ఉద్యోగులు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే ఈ నెల వేతనం ఇస్తామని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా కారణంతో, ఆధారాలను డాక్టర్ల ధృవీకరణతో అందించాలని తెలిపింది. స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించినా.. కొందరు టీకాలు తీసుకోలేదని ఎండీ మురళీధర్ చెప్పారు. ఇలాంటి వారి వల్ల సాధారణ ప్రజలకు కరోనా సోకే అవకాశం ఉన్నందున టీకాలను తప్పనిసరి చేశామన్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 40వేల 730 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 203 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరొకరు మృతి చెందారు. ఇక మరో 160మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3వేల 852యాక్టివ్ కేసులున్నాయి.