రోశ‌య్య కెరీర్‌లో ఇన్ని సంవ‌త్స‌రాలు ప‌ద‌వుల్లోనే...!

VUYYURU SUBHASH
మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య త‌న కెరీర్‌లో ఎన్నో సంవ‌త్స‌రాలు ప‌ద‌వుల‌కే అంకిత‌మై పోయారు. గుంటూరు జిల్లా వేమూరులో జ‌న్మించిన రోశ‌య్య వ‌య‌స్సు 89 సంవ‌త్స‌రాలు. ఒక్క సారి ఆయ‌న ఎన్ని సంవ‌త్స‌రాలు ప‌ద‌వుల్లో ఉన్నారో చూస్తే షాక్ అవ్వ‌క త‌ప్ప‌దు. సుధీర్ఘ‌మైన రాజ‌కీయ ప్ర‌స్థానం రోశ‌య్య‌కే సొంతం. రోశ‌య్య ప‌ద‌వుల జ‌ర్నీ ఇలా ఉంది.

1968-85: శాసనమండలి సభ్యుడు
1978-79: శాసనమండలిలో ప్రతిపక్ష నేత

1979-83: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
1985-89: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు.

1989-94: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
2004-09: చీరాల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు.

2004 : రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
2009 : రాష్ట్ర శాసనమండలి సభ్యుడు.

2009 సెప్టెంబరు - 2010 నవంబరు 24: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
2011, ఆగస్టు 31: తమిళనాడు గవర్నరు.

ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ గా, లోక్‌సభ స‌భ్యుడిగా.. ఎన్నో శాఖ‌ల‌కు మంత్రి గా, ముఖ్య‌మంత్రిగా, గ‌వ‌ర్న‌ర్ గా ఇలా అనేక ప‌ద‌వులు చేప‌ట్టిన ఘ‌న‌త రోశ‌య్య‌కే సొంత‌మైంది. ఎమ్మెల్యే గా 1989 లో తెనాలి నుంచి గెలిచిన రోశ‌య్య ఆ త‌ర్వాత 2004 లో ప్ర‌కాశం జిల్లా చీరాల నుంచి మ‌రోసారి ఎమ్మెల్యే అయ్యారు. మ‌ధ్య‌లో 1998లో గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట నుంచి ఎంపీ గా కూడా గెలిచారు. ఇక ఎన్నో శాఖ‌ల‌కు మంత్రి గా ప‌ని చేశారు.

ఇక యేడాది కి పైగా ఆయ‌న ముఖ్య‌మంత్రి గా కూడా ఉన్నారు. రాజ‌శేఖ‌ర్ హ‌ఠాన్మ‌ర‌ణంతో కాంగ్రెస్ అధిష్టానానికి సైతం ఏం చేయాలో తెలియ‌లేదు. ఈ క్ర‌మంలోనే అప్ప‌టిక‌ప్పుడు రోశ‌య్య ను ఆఘ మేఘాల మీద ముఖ్య‌మంత్రి గా ఎంపిక చేసింది. ముఖ్య‌మంత్రి గా కూడా నాటి స‌మైక్య రాష్ట్రంలో అప్పుడు ఉన్న ఇబ్బందుల‌ను ఆయ‌న ఎదుర్కొని మ‌రీ పాల‌న చేశారు.

ఆ త‌ర్వాత కూడా రోశ‌య్య ను త‌మిళ నాడు గ‌వ‌ర్న‌ర్ గా పంపిన నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆయ‌న గౌర‌వాన్ని మ‌రింత పెంచింద‌నే చెప్పాలి.  రోశయ్య జీవించి ఉన్న‌న్ని రోజులు కూడా ఆయ‌న పై స్థాయిలోనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: