కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరమో తెలుసా..?

NAGARJUNA NAKKA
దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ను గుర్తించిన శాస్త్రవేత్తలు దానికి.. B.1.1.529గా పేరు పెట్టారు. ఈ కొత్త రకంలో డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా 10ఉత్పరివర్తనాలను గుర్తించినట్టు చెప్పారు. డెల్టాతో పోలిస్తే దీనికి వ్యాప్తి వేగం అధికంగా ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎక్కువగా యువకులకు సోకుతున్నట్టు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఆ దేశంలో ఈ రకం కేసులు 22గుర్తించారు.
కరోనా కొత్త వేరియంట్ పై రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విదేశీ ప్రయాణీకుల విషయంలో రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేయగా.. విదేశీ ప్రయాణీకులకు స్క్రీనింగ్ పరీక్షలు పగడ్బంధీగా చేయాలని స్పష్టం చేసింది. విదేశీ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు ఖచ్చితంగా చేయాలన్న కేంద్రం.. దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి వచ్చేవారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలంది.
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వేరియంట్ అత్యంత ప్రమాదకరమైందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డా.హాప్కిన్స్ తెలిపారు. దీని ఆర్ వ్యాల్యూ మిగతా వేరియంట్ల కంటే అధికంగా ఉందనీ.. రోగ నిరోధక శక్తిని ఏమార్చి ప్రజల మధ్య వేగంగా వ్యాపిస్తుందన్నారు. సౌతాఫ్రికా, హాంగ్ కాంగ్ బోత్స్ వానాలో ఈ కేసులు వచ్చాయన్నారు. యూకేలో గత వారం 50వేల కేసులు రావడం ఆందోళన కలిగిస్తుందన్నారు.
మరోవైపు కొత్త కరోనా వేరియంట్.. స్టాక్ మార్కెట్ ను తీవ్రంగా దెబ్బతీసింది. బీఎస్ ఈ సెన్సెక్స్ 1,688 పాయింట్లు పతనమై 57వేల 107వద్ద ముగియడంతో పెట్టుబడిదారుల సంపద 7.45లక్షల కోట్ల రూపాయలు పడిపోయింది. అయితే కొత్త వేరియంట్ పై డబ్ల్యూహెచ్ ఓ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన వేరియంట్ల కంటే దీనికి వేగంగా వ్యాపించే గుణం ఉన్నట్టు అంచనా వేసింది. దీనిపై చర్యకు అత్యవసర సమావేశం కానుంది.ఈ కొత్త వేరియంట్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: