వియ్యంకుళ్లు అయిన వైసీపీ ఎమ్మెల్యేలు...!
ఆ తర్వాత అప్పటి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమార్తెను శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహం చేసుకున్నారు. ఇక ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని ప్రస్తుతం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గా ఉన్నారు. ఆమె కూడా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు స్వయానా కోడలు కావడం విశేషం. ఇక తాజాగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ లో ఇద్దరు ఎమ్మెల్యేలు వియ్యంకులు అయ్యారు.
కృష్ణా జిల్లా లోని మాజీ మంత్రి, ప్రస్తుత పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కుమారుడి వివాహాం జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా హాజరయ్యారు. ఈ పెళ్లి విజయవాడ సమీపంలోని కానూరు వీఆర్ సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరిగింది. ఇక సారథి కుమారుడు వరుడు నితిన్ కృష్ణ కాగా, వధువు పేరు అమృత భార్గవి. ఆమె ఎవరో కాదు.. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కుమార్తె కావడం విశేషం.
వీరిలో సారథి ఇప్పటికే మూడు సార్లు ఎమ్మె ల్యేగా గెలవడంతో పాటు గతంలో వైఎస్, కిరణ్ కుమార్, రోశయ్య ముఖ్యమంత్రు లుగా ఉన్నప్పుడు మంత్రి గా కూడా పనిచేశారు. ఇక బుర్రా మధు సూధన్ 2014 ఎన్నికల్లో కనిగిరి నుంచి ఎమ్మెల్యే గా వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక గత ఎన్నికల్లో బంపర్ మెజార్టీ తో తొలిసారి ఎమ్మెల్యే గా గెలిచారు. ఇక ఇప్పుడు వీరిద్దరు వియ్యంకు లు అయ్యారు.