బాబుకు ఆ మూడు వ్యూహాలు ఫ‌లించాయా...!

VUYYURU SUBHASH
ఊర‌క‌రారు మ‌హానుభావులు! అన్న‌ట్టుగా.. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న చంద్ర‌బాబు వంటి నాయ‌కు లు ఏం చేసినా.. ఊరికేనే చేస్తారా? త‌ల‌పండిన నాయ‌కుడైన చంద్ర‌బాబు ఒక్క అడుగు తీసి అడుగు వేస్తే.. స‌వాల‌క్ష ఆలోచ‌న‌లు చేస్తారు. త‌న‌కు, త‌న పార్టీకి మైలేజీ ఇచ్చే అంశాల‌నే ఆయ‌న చేప‌డ‌తారు. ఇది గ‌తంలోనే కాదు.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూచూశాం. అప్ప‌టి వ‌ర‌కు ప‌ది రూపాయలు పేద‌ల‌కు ఇచ్చేందుకు ఎన్నో ఆల‌చ‌న‌లు చేసిన‌.. చంద్ర‌బాబు ఎన్నిక‌లకు ముందు ప‌సుపు-కుంకుమ పేరుతో.. మ‌హిళ‌ల‌కు డ‌బ్బులు పందేరం చేశారు. ఇది క‌లిసి వ‌చ్చిందోలేదో అంద‌రికీ తెలిసిందే.

ఇక‌, ఇప్పుడు కూడా చంద్ర‌బాబు `శుక్ర‌వారం అసెంబ్లీ` ఘ‌ట‌న ను త‌న‌కు రాజ‌కీయంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని.. వైసీపీ నాయకులు చెబుతున్నారు. చంద్ర‌బాబు.. త‌న జీవితంలో అందివ‌చ్చిన ఏ అవ‌కాశాన్నీ వ‌దుల‌కునే ప్ర‌య‌త్నం చేయ‌ర‌ని.. కూడా అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ స‌న్నిహిత వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం మేర‌కు.. చంద్ర‌బాబు మూడు వ్యూహాల‌తో ఇలా మీడియా ముందుకు వ‌చ్చి విల‌పించార‌ని అంటున్నారు.

వీటిలో ప్ర‌ధాన‌మైంది.. కుప్పం మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి ద్వారా.. వైసీపీకి ల‌భించిన‌.. క్రేజ్‌ను తొక్కేయ‌డం. మీడియాలో ఎక్క‌డా చ‌ర్చ‌కు రాకుండా చేయ‌డం. ఇది స‌క్సెస్ అయ్యారు. ఎందుకంటే.. చంద్ర‌బాబు ఏడుపుతో అన్నివిష‌యాలు ప‌క్క‌కు పోయాయి. రెండు.. త‌న పార్టీ శ్రేణుల‌ను రోడ్డెక్కించి.. పార్టీ స‌త్తాను నిరూపించ‌డం. ఇది కూడా చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. రోడ్డెక్కారు. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. అదేస‌మ‌యంలో అత్యంత‌కీల‌క‌మైన వ్యూహం... నంద‌మూరి కుటుంబానికి త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం.

అంతేకాదు.. వారుత‌న చెప్పుచేత‌ల్లోనే ఉన్నార‌ని.. ఆయ‌న ప‌రోక్షంగా నిరూపించ‌డం. అదేస‌మ‌యంలో టీడీపీ త‌న‌ద‌న‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు .. జూనియ‌ర్‌రావాలి. నంద‌మూరి కుటుంబానికి పార్టీని అప్ప‌గించాల‌నే వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న చెప్ప‌క‌నే చెక్ చెప్పార‌ని కూడా అంటున్నారు. ఈ మూడు వ్యూహాలను అమ‌లు చేయ‌డం ద్వారా...తాను మ‌రోసారి పుంజుకున్న‌ట్టుగా ప్ర‌జ‌ల‌కు ఆయ‌న సంకేతాలు ఇచ్చార‌ని.. అంటున్నారు. అదేస‌మ‌యంలో నంద‌మూరి కుటుంబాన్ని రంగంలోకి దింప‌డం ద్వారా.. త‌న‌కు తిరుగేలేద‌ని.. ఆయ‌న స్ప‌ష్టం చేసిన‌ట్టు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: