జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : బాబు గారి ఏడుపు సరే.. ప్రజల ఏడుపు మరీ?

praveen
ఇటీవల ఏపీ అసెంబ్లీ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తన భార్య క్యారెక్టర్ ను దూషించారు అంటూ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటనీరు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారిపోయింది. అంతేకాదు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగుపెడతాను అంటూ శబతం చేశారు చంద్రబాబు నాయుడు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా వెక్కివెక్కి ఏడవటం.. ఎంతోమంది మనసును కదిలించింది. అయితే ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో ఏపీ రాజకీయాలు ఒక్క సారిగా హాట్ హాట్ గా మారిపోయాయి అని చెప్పాలి.



 ప్రస్తుతం మీడియాలో ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు ఏడ్చారు.. దానికి కారణం వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలే అంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపుచంద్రబాబు ఆడుతుంది మొత్తం డ్రామానే.. తాము ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదు అంటూ వైసీపీ నేతలు చెప్పడం కూడా మెయిన్ న్యూస్ గా మారిపోయింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి గురించి చాలా తక్కువగానే కనిపిస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా చిత్తూరు కడప జిల్లాలో అతి భారీ వర్షాల కారణంగా ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి ఏర్పడింది.



 ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ భారీగా వరద నీరు చేరుకోవడంతో దిక్కుతోచని స్థితిలో కి వెళ్లి పోతున్నారు జనాలు. ఏకంగా వరదల ధాటికి ఇల్లు సైతం కొట్టుకుపోతున్న పరిస్థితి ఏర్పడింది. దీంతోవరదల్లో చిక్కుకున్న ఎంతోమంది అమాయక ప్రజలు హాహాకారాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అయితే రాష్ట్రంలో వర్షాల కారణంగా ఇంత జరుగుతున్నా మీడియా మాత్రం ఎక్కువగా చంద్రబాబు ఏడ్చారు అన్న విషయాన్ని  ఫోకస్ చేయడంపై మాత్రం ప్రస్తుతం విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు గురించి  ప్రస్తావించడం మంచిదే కానీ అలా అని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా దానిని పట్టించుకోకుండా కేవలంఒక్క విషయం పైనే మాత్రమే ఫోకస్ చేయడం మాత్రం ఏమాత్రం మంచిది కాదు అని అంటున్నారు. ఇలా ప్రస్తుతం అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్ష కూడా పూర్తిగా అసెంబ్లీలో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప... వరదల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ప్రజల గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: