వీర్రాజు అంత పోటుగాడా.. మరి ఈ రిజల్ట్ ఏంది సామీ...!
అయితే ఉన్నంతలో కాస్త ఊరట ఏంటంటే ప్రతిపక్ష టీడీపీ చాలా చోట్ల పుంజుకుంది. రెండు మున్సిపాల్టీ లు గెలుచు కోవడంతో పాటు పలు చోట్ల గట్టి ఓట్లు తెచ్చుకుంది. అయితే జనసేన ఎంతో సాధించేశామని చెపుతున్నా గ్రౌండ్ లెవల్లో చూస్తే అంత గొప్ప ఫలితాలు ఆ పార్టీకీ రాలేదనే తెలుస్తోంది. ఆకివీడు లో టీడీపీతో పొత్తు పెట్టుకుని కేవలం మూడు చోట్ల గెలిచింది.
ఇక గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఒక్క వార్డుతో సరిపెట్టుకుంది. ఇక గోదావరి జిల్లాల లో రెండు ఎంపీటీసీలు అది కూడా టీడీపీ తో పొత్తు ఉంటేనే గెలిచింది. ఇక బీజేపీ అయితే మరీ ఘోరంగా ఒక్క చోట కూడా విజయం సాధించ లేదు. ఏదేమైనా ఏపీకి బీజేపీ చేసిన అన్యాయంతో ప్రజలు కసి తో రగిలి పోతున్నారు. ఆ పార్టీకి తాము ఎప్పటకీ కూడా చాన్స్ ఇవ్వమని చెప్పకనే చెప్పేశారు.
అందుకే ఆ పార్టీని ఇంతలా బొంద పెడుతున్నారన్నది అర్థమవుతోంది. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు పోటుగాడినే అనుకుంటున్నా జనాలు మాత్రం ఆయనకు అంత సీన్ లేదని తేల్చేశారు. ఇక ప్రభుత్వ వ్యతిరేకత తో స్థానిక ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలుస్తామనుకున్న ఆ రెండు పార్టీలకు పెద్ద షాక్ తప్పలేదు.