పిఓకేని వదిలి పెట్టండి.. పాక్ కి వార్నింగ్?

praveen
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ అన్ని విషయాలలో కూడా ఎంతో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో శత్రుదేశాల వ్యూహాలకు చెక్ పెట్టడం లో కీలక పాత్ర వహిస్తుంది. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి వేదికగా కూడా శత్రు దేశాలకు ఎంతో గట్టిగానే కౌంటర్లు ఇస్తూ వస్తోంది భారత్. దౌత్య పరంగా కూడా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వస్తోంది. ఒకప్పుడు ఐక్యరాజ్య సమితి వేదికగా శత్రు దేశాలు భారత్ పై ఎన్ని విమర్శలు చేసినప్పటికీ.. ఇలాంటి విమర్శలు ఖండిస్తున్నాము అంటూ సున్నితంగా వ్యవహరించేది భారత్.



 కానీ ఇప్పుడు మాత్రం ఎంతో దూకుడు గానే ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి వేదికగా భారత శత్రుదేశాలుగా కొనసాగుతున్న పాకిస్థాన్ చైనా తీరును ఎన్నోసార్లు ఎండగడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది భారత్. ఇక ఇప్పుడు మరో సారి ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చింది. పాకిస్థాన్లో ఉగ్రవాదులు ఇప్పటికే స్వేచ్ఛగా తిరుగుతారు అన్న విషయం నిరూపణ కూడా అయింది. ఉగ్రవాదులను పెంచి పోషించడమే పాకిస్తాన్ విధానం అంటూ భారత దుయ్య పట్టింది.. ఇటీవల జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత శాశ్వత మిషన్ కౌన్సిలర్ గా ఉన్నా కాజల్ భట్ పాకిస్థాన్ తీరును ఎండగట్టారు.



 అయితే ఈ సమావేశంలో పాకిస్థాన్ రాయబారి మునీర్ జమ్మూ కాశ్మీర్ విషయంలో చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు కాజల్ భట్.  కాశ్మీర్ పై పాకిస్తాన్ అవాస్తవాలను ప్రచారం చేయడం కొత్త విషయం ఏమీ కాదు అంటూ వ్యాఖ్యానించారు ఆమె. కాశ్మీర్ లడక్ ప్రాంతాన్ని కూడా భారత్లో అంతర్భాగం అంటూ ఐరాస వేదికగా  స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్లో భాగమేనని చట్ట విరుద్ధంగా ఆక్రమించుకున్న ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేసి భారత్కు అప్పగించాలంటూ ఐరాస వేదికగా పాకిస్థాన్కు అల్టిమేటం జారీ చేశారు కాజల్ భట్. పాకిస్తాన్ సహా ఇరుగుపొరుగు దేశాలతో కూడా ఎంతో సామరస్యంగా మెలగాలని భారత్  కోరుకుంటూ ఉంటుంది.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆపితే భారత్ పాకిస్తాన్ తో శాంతియుత చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉంది అంటూ కాజల్ భట్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: