ఇవాళ కూడా జగన్ హవాయేనా..?

Chakravarthi Kalyan
ఏపీలో వైసీపీ హవా నడుస్తోంది.. ఏ ఎన్నికలు జరిగినా వైసీపీ విజయబావుటా ఎగరేస్తోంది. పంచాయతీ ఎన్నికలు.. మున్సిపాలిటీ ఎన్నికలు.. ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇలా ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం వైసీపీనే వరిస్తోంది. నిన్న ఓట్ల లెక్కింపు జరిగిన నెల్లూరు కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీల్లోనూ వైసీపీ సత్తా చాటింది. ఒక్క దర్శి మినహా ఎక్కడా టీడీపీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. ఇక నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మరీ దారుణం.. 54 డివిజన్లలో కనీసం ఒక్కటి కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది.

ఇక ఇవాళ 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 16న జరిగిన పోలింగ్‌ జరిగింది. మరో 14 జడ్పీటీసీ స్థానాల్లో 4 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 10 జడ్పీటీసీ స్థానాలకు జరిగిన పోలింగ్‌ జరిగింది.  176 ఎంపీటీసీ స్థానాలకు 50 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మరో  మూడు స్థానాలకు అసలు నామినేషన్లు దాఖలు కాలేదు.

ఇలా మొత్తం 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఇవాళ ఆ ఓట్ల ఫలితాలు రాబోతున్నాయి. వీటిపైనా టీడీపీ పెద్దగా ఆశలేమీ పెట్టుకోలేదు. అయితే జగన్ పరిపాలన రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రజల్లో ఏమైనా అసంతృప్తి ఉంటే.. ఈ ఓట్ల రూపంలో బయటపడే అవకాశం ఉందనేది కొందరి వాదన. అయితే.. ఈ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పూర్తిగా స్థానిక అంశాలు, స్థానిక రాజకీయాల ప్రభావమే ఉంటుందని అందువల్ల సర్కారుపై వ్యతిరేకత కనిపిస్తుందని భావించలేమని మరికొందరు వాదిస్తున్నారు.

ఏదేమైనా.. వీటిలోనూ వైసీపీ ప్రభంజనం కనిపించే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల టీడీపీ అసలు పోటీ చేస్తున్న ప్రభావం కనిపించడం లేదు. ముందే చేతులెత్తేస్తోంది. అధికార పక్షంగా బలంగా ఉన్న నేపథ్యంలో తలపడటం అనవసర వృథా ప్రయాస అన్న భావన  టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. చూడాలి.. ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: