సోము మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ అయిపోయాడా... బీజేపీలో ఏం జ‌రుగుతోంది...!

VUYYURU SUBHASH
ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు.. ఆర్ ఎస్ ఎస్ నాయ‌కుడు.. సోము వీర్రాజుకు ప‌వ‌ర్స్ పెరిగాయా? ఆయ‌న కు ఇక‌పై ఏపీలో తిరుగులేదా?  ఇక‌, నుంచి నాయ‌కులు అంద‌రూ ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే ప‌నిచేయాల్సి ఉంటుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు బీజేపీ నాయ‌కులు సైలెంట్‌గా!  ఇప్ప‌టి వ‌ర‌కు సోము దారి సోముది .. అన్న ట్టుగా.. రాష్ట్రంలో బీజేపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎవ‌రికి వారు గ్రూపు రాజ‌కీయాలు చేసుకుంటు న్నారు. నిజానికిగ్రూపు రాజ‌కీయాలు.. కాంగ్రెస్‌కు మాత్ర‌మే ప‌రిమితం. కానీ, బీజేపీలోనూ.. ఏపీలో ఇటీవ‌ల గ్రూపులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర పార్టీకి చీఫ్ అయిన‌ప్ప‌టికీ.. సోము మాట‌ల‌ను ఎవ‌రూ వినిపించు కోవ‌డం లేదు.

అంతేకాదు.. సోమును లైట్ తీసుకునేవారు కూడా పెరిగిపోయారు. అయితే.. ఆయా ప‌రిణామాల‌పై సోము ఇప్ప‌టి వ‌ర‌కు స‌హిస్తూ వ‌చ్చారు. కానీ.. ఎలా తెలిసిందో .. ఏమో.. కేంద్రంలోని అగ్ర‌నేత‌.. అమిత్‌షాకు సోము ప‌డుతున్న ఇబ్బందులు తెలిసాయి. దీంతో ఆయ‌న గ‌ట్టిగానే రాష్ట్ర నాయ‌కుల‌కు వార్నింగ్ ఇచ్చారు. తాజాగా తిరుప‌తిలో ప‌ర్య‌టించిన షా.. రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల‌పై ప‌ర్య‌ట‌న చివ‌రిరోజు.. చ‌ర్చించారు. ఈ స‌మావేశానికి పురందేశ్వ‌రి, జీవీఎల్ న‌ర‌సింహారావు.. వంటివారు హాజ‌ర‌య్యారు.  

ఈ క్ర‌మంలో సోమును ఎవ‌రూ లెక్క‌చేయ‌డం లేద‌నే విష‌యం త‌న దృష్టికి వ‌చ్చింద‌ని. షా చెప్పేస‌రికి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అంతేకాదు.. మీరు మీమీ అభిప్రాయాలు చెప్పండి. కానీ.. అంతిమంగా.. సోము వీర్రాజు ఏం చెబుతారో.. వినండి.. ఆయ‌న చెప్పిన‌ట్టు చేయండి. ఆయ‌న మాటే ఫైన‌ల్. కాదంటే చె ప్పండి.. ఏం చేస్తానో.. మీరే చూస్తారు! అని షా హెచ్చ‌రించారు. ఇంకేముంది.. అప్ప‌టి వ‌ర‌కు సోము పై ఫిర్యాదులు చెప్పేందుకు రాసుకున్న స్క్రిప్టుల‌తో వెళ్లిన నాయ‌కులు వెనుదిరిగారు. అంతేకాదు.. సోముకు కూడా షా.. గ‌ట్టిగానే కొన్ని విష‌యాలు చెప్పార‌ని స‌మాచారం.

అంద‌రినీ క‌లుపుకొని పోవాల‌ని.. అన్ని సామాజిక వ‌ర్గాల అండ ఉంటే త‌ప్ప‌.. బీజేపీ ఎద‌గ‌ద‌ని.. ప్ర‌తి ఒక్క నాయ‌కుడు మ‌న‌కు అవ‌స‌ర‌మేన‌ని.. కూడా ఆయ‌న వెల్ల‌డించిన‌ట్టు.. బీజేపీలో గుస‌గుస వినిపిస్తోంది. ఈ ప‌రిణామాలు చూసిన త‌ర్వాత‌.. సోము పీఠం ప‌దిలంగా ఉండ‌డమే కాకుండా.. ఆయ‌న‌కు మ‌రిన్ని ప‌వ‌ర్స్ వ‌చ్చాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: