బాల భారతం : ఆటిజమా మేమున్నాం!
సంపద అంతా ఈ దేశానిదే..అందులో కొంత మన అవసరాలకు. చిన్నారుల కూడా ఈ దేశ సంపదే కానీ వారికి అందుతుందా?
అందాల్సిన స్థాయిలో వైద్యం కానీ విద్య కానీ! ఖరీదయిన జబ్బులు కొన్ని చిన్నారులను వేధించేటప్పుడు ఆస్పత్రుల జాలి లేని తనం చూశాం. కానీ ఓ సంస్థ తాను సంపాదించిన ప్రతి రూపాయీ ఆటిజం తో బాధపడే పిల్లలకు వెచ్చించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగుతేర ప్రాంతాలలో సైతం ఆన్ లైన్ ద్వారా సేవలు అందిస్తూ తరిస్తోంది. సరిపల్లి కోటిరెడ్డి గ్రూప్స్ ఇందుకోసం నిత్యం పరిశ్రమిస్తూ, ఆటిజం తో బాధపడే చిన్నారుల జీవితాల్లో కొత్త ఆనందాలు
తీసుకువస్తోంది.
భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్నిదేశాలూ ఆటిజం అనే సమస్య ను ఎదుర్కొంటున్నాయి. కష్ట కాలంలో ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నాయి. లాభాపేక్ష లేని విధంగా ఆస్పత్రులను ఆధునిక భారతంలో చూడలేం కానీ ఓ సంస్థ తన వంతు కొన్ని కోట్లు వెచ్చించి ఆటిజం థెరఫీ సెంటర్లను ఏర్పాటు చేసి మానవతా దృక్పథాన్ని చాటుతోంది. సంపాదించిన ప్రతి రూపాయీ సామాజిక ప్రయోజనానికే వెచ్చిస్తోంది. పినాకిల్ బ్లూమ్స్ సంస్థ అధినేత సరిపల్లి కోటిరెడ్డి దంపతులు ఇందుకు సంబంధించి పరిశోధన చేసి ఆటిజం పిల్లలను ఎలా ఆదుకోవాలి ఏ రకం థెరఫీ అందించాలి అన్న విషయమై నిపుణులతో చర్చించి, చిన్నారులకు భరోసా ఇచ్చేలా కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకువచ్చారు. తమ ఇంటిలో వెలుగు చూసిన సమస్యను పరిష్కరించే క్రమంలో ఆ కుటుంబం ఎంతో మానసిక వేదనకు గురయింది. దీంతో ఈ సమస్య మూలాలు ఏంటి చిన్నారులకు ఏమీ తెలియని వయసులో ఉన్న బుద్ధి మాంద్యాన్ని ఎలా గుర్తించడం, గుర్తించాక అందించాల్సిన చికిత్సా విధానం ఏంటి అన్నది కోటి రెడ్డి దంపతులకు మొదట్లో పెను సవాలుగా మారినా తరువాత తరువాత అధ్యయనంతో ఎన్నో మార్గాలు వీరికి తెలిసి వచ్చాయి.
తమ ఆటిజం థెరఫీ సెంటర్లలో ప్రతి బిడ్డనూ ఎంతో శ్రద్ధగా చూసుకుంటామని, వారి మానసిక ఎదుగుదలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు చేరవేస్తామని, ముఖ్యంగా ప్రతి రోజూ తల్లిదండ్రులకు 45 నిమిషాల పాటు కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పారు శ్రీజారెడ్డి సరిపల్లి. ఆమె నేతృత్వంలో నడుస్తున్న ఈ ఆటిజం థెరఫీ సెంటర్లు చిన్నారులకో వరం అయ్యాయి. ఎందరెందరో తల్లిదండ్రుల బాధలు ఇక్కడ తీరుతున్నాయి. మెరుగైన చికిత్స ఆధునిక వైద్య విధానం జోడింపు, సైకాలజీ స్పెషలిస్టులతో చర్చలు ఇవన్నీ పినాకిల్ బ్లూమ్స్ ప్రత్యేకతలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే చిన్నారులకు అందించే స్పీచ్
థెరఫీ, ఐక్యూ పెంపు అన్నవి నిపుణుల సాయంతో అందిస్తారు. అదేవిధంగా మానసిక, శారీరక ఎదుగులదలకు ప్రథమ ప్రాధాన్యం
ఇస్తారు. బుద్ధి మాంధ్యం తగ్గేందుకు ప్రతిరోజూ వివిధ విభాగాలకు చెందిన నిపుణులు తమ వంతు చికిత్స అందిస్తూనే, వివిధ
థెరఫీలను అందుబాటులో ఉంచుతారు. ఇవన్నీ చాలా మంచి ప్రశంసలు అందుకున్నాయి. దేశ విదేశాల్లో ఉన్న చిన్నారులకు సైతం పినాకిల్ బ్లూమ్స్ తన సేవలు అందించడం విశేషం. వివరాలకు 9100 181181 అనే నంబర్ కు కాంటాక్స్ చేయవచ్చని,
ఈ హెల్ప్ లైన్ నంబర్ సాయంతో దేశ వ్యాప్తంగా ఉన్న వారెవరయినా తమను సంప్రదించవచ్చని చెబుతున్నారు పినాకిల్ బ్లూమ్స్ నిర్వాహకులు.