కూకట్‌పల్లిలో 44 ఎకరాల అమ్మకం... ఎన్ని కోట్ల డీలో తెలుసా...!
దేశ వ్యాప్తంగా .. ఇంకా చెప్పాలంటే ముంబై లాంటి మహా నగరాల కంటే కూడా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనువై న ప్రదేశం గా హైదరాబాద్ నిలుస్తుందని మార్కెట్ వర్గాలు కూడా లెక్కులు వేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ మహా నగరంలోనే కీలకమైన కూకట్ పల్లి ఏరియా ఎలాంటి ప్రైమ్ ఏరియా నో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఏరియా లో ఒకే చోట ఏకంగా 44 ఎకరాలను సేల్ చేసేందుకు ఓ డీల్ కుదిరింది. మహా నగరంలో ఒకే చోట 44 ఎకరాలు. అది కూడా నగరానికి గుండె కాయ లాంటి ఏరియా కావడంతో మార్కెట్ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి.
కూకల్ పల్లి ఐడీ ఎల్ చెరువు పక్క నే ఉన్న 44 ఎకరాల భూమి ఉంది. దీనిని జీఓసీఎల్ కార్పొరేషన్ సంస్థ నగరానికే చెందిన ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రు. 451 కోట్లకు అమ్మినట్టు చెపుతున్నారు. ఈ మేరకు రెండు వాయిదాల్లో చెల్లించేలా వీరి మధ్య ఒప్పందం కూడా కుదిరిందంటున్నారు. ఇప్పటికే రు. 112 కోట్లు చెల్లించిందని కూడా అంటున్నారు. ఈ డీల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు.