రెడ్లకు జగన్ మార్క్ బిగ్ షాక్ రెడీ...!
గత ఎన్నికల్లో జిల్లా నుంచి ఎక్కువ మంది రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో సీనియర్లు కూడా చాలా మందే ఉన్నారు. అయితే జగన్ ఎవ్వరూ ఊహించని విధంగా తొలి సారి ఎమ్మెల్యే గా గెలవడంతో పాటు చాలా జూనియర్ అయిన పెనుకొండ నుంచి గెలిచిన శంకరనారాయణకు మంత్రి పదవి ఇచ్చారు. కేవలం బీసీ కోటాలో .. ఆయన కురుబ సామాజికవర్గం కావడంతో మంత్రి పదవిని తొలి దఫా వచ్చింది. పైగా జిల్లా నుంచి కేవలం ఒక్క నేతకే జగన్ మంత్రి పదవి ఇచ్చారు.
అయితే ఈ సారి తమకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని వైసీపీ రెడ్డి సామాజికవర్గం నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సారి కూడా కురుబ వర్గానికే మంత్రి పదవి ఇవ్వబోతున్నారట. ఈ సారి ఈ కోటాలో కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కు జగన్ మంత్రి పదవి ఇస్తారన్న టాక్ వైసీపీ నేతల్లోనే ఉంది. దీంతో అనంత వెంకట్రా మిరెడ్డి తో పాటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లాంటి నేతలు తమ కు పదవి వస్తుందా ? రాదా ? అని తెగ టెన్షన్ పడి పోతున్నారట.
తమకు కాకుండా ఉషా శ్రీ లాంటి జూనియర్ మహిళా నేతకు మంత్రి పదవి ఇస్తే రాజకీయంగా తాము తల ఎత్తుకోలేమన్న ఆవేదన కూడా వారిలో ఉందట. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.