చంద్రబాబుని బీజేపీ అంతలా భయపెట్టిందా...?
అందుకే చంద్రబాబు సైతం రాష్ట్రంలోకి సిబిఐ రావడానికి వీలు లేదని ఆదేశాలు కూడా ఇచ్చారు. అంటే ఏ విధంగా బీజేపీ...ఈడీ, సిబిఐలని వాడుకుని బాబుని భయపెట్టిందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అదే విషయాన్ని తెలంగాణ సిఎం కేసిఆర్ పరోక్షంగా చెబుతున్నారు. ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలు, కేసీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయమని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ అవినీతి చేశారని, సిబిఐ విచారణ జరగడం ఖాయమని, ఆయన్ని జైలుకు పంపిస్తామని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్, బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.
ఇదేంటని ప్రశ్నిస్తే ఐటీ దాడులు చేస్తారా? అన్యాయంగా కేసులు పెడతారా? అని ప్రశ్నించిన కేసీఆర్..అక్కడో ఇక్కడో భయపెట్టినట్లు ఇక్కడ సాగదని, అడ్డగోలుగా దుర్వినియోగం చేసి తమను ఏదైనా చేద్దామని అనుకుంటే వాళ్లే నష్టపోతారని, ఏ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ బీజేపీపై ఫైర్ అయ్యారు. అంటే అక్కడో, ఇక్కడో అంటే 2019 ఎన్నికల ముందు బీజేపీ...చంద్రబాబుని భయపెట్టిందన్నట్లు కేసీఆర్ పరోక్షంగా చెప్పుకొచ్చినట్లు ఉంది. అయితే కేంద్రంలోని బీజేపీ తమ అధికారంతో కొందరు నేతలని భయపెట్టిందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాగే కేసీఆర్‌ని కూడా ఇరుకున పెట్టడానికి ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది.