కేసీఆర్ :బండి మాటలు నమ్మితే నిండా మునుగుడే..!

MOHAN BABU
పచ్చి తప్పులను, నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా ఏది బడితే అది మాట్లాడవచ్చా..? ఆయన మాట్లాడింది శుద్ద తప్పే. ఆయనకు నెత్తి లేదు. జిమ్మెదారి లేదు. బాధ్యతకూడా లేదు. నోటికి ఏదోస్తే అది మాట్లాడుతు ఉన్నాడు. గిప్పుడే కాదు.. చానా రోజుల నుండి గిట్లనే మాట్లాడుతు ఉ న్నడు.  నేను కూడా అతడి మాటలను క్షమిస్తూ వచ్చిన కానీ నా స్థాయి మనిషి కాదని చిన్నవాడని పట్టించుకోలేదు. నా మీద వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు  మాట్లాడినా పట్టించుకోలేదు. ఏనుగులు పోతు ఉంటే కుక్కలు మొరుగతవని వదిలిపెట్టినా కానీ, మరీ ఎక్కువ  చేస్తున్నడు..

తెలంగాణ రైతులను గత ఏడేండ్ల నుండి కంటికి రెప్పలా నిద్ర లేకుండా కాపాడి. ఒక స్థాయికి తీసుకొచ్చి  వారి అప్పులను కట్టించి వారిని గడ్డకేసి బాగుపడాలని  తీసుకోని పోతావుంటే. మొత్తం రైతాంగం బ్రతుకునే ఆగం జెసే విధంగా బాధ్యత లేకుండా మాట్లాడుతుంటే ఆయనను ఏమనాలి..? నీకేమి గావాలె చెప్పు.. రైతున్నలు ధాన్యం పండియ్యాలే కానీ నీవు ఢిల్లీలో మాత్రం తీసుకోవు. ఇక్కడ రోడ్ల మీద కూసోని ధర్నా చేయాలె. రాజకీయ  పబ్బం గడుపుకోవాలె. అంతే కదా..!వానకాలంలో 62 లక్షల ఎకరాల వరిపంట వేసిన్రు. కోతలు కూడా మొదలు  అయినయి. ధాన్యం వస్తున్నది. ఎంత ధాన్యం తీసుకుంటరో కూడా ఈరోజు వరకు కమ్యూనికేషన్‌ అనేది లేదు. సుమారు కోటి 70 లక్షల టన్నుల వరకు ధాన్యం వస్తే, కోటి 10 లక్షల టన్నుల వరకు రైస్‌ కూడా వస్తుంది. వానకాలంలో అందించిన పంటనే తీసుకునే దిక్కులేదు. దానికే ఇప్పటికీ లెటర్‌ రాలేదు. ఇక  బండి సంజయ్‌ మాత్రం  యాసంగిలో వరి వేయాలంటున్నడు.
నేను రైతాంగానికి చెప్తున్నా
ఈ బండి సంజయ్‌ సొల్లు కబుర్లను నమ్మి , పనికి మాలిన మాటలను నమ్మి. వరి పంటను గనుక వేస్తే పూర్తిగా దెబ్బతింటం. తెలంగాణలో ఉండేటువంటి  వాతావరణ పరిస్థితుల వల్ల యాసంగిలో వరి పంట అనేది మనకు క్షేమదాయకం కాదని. ధాన్యం తీసుకోవాల్సిన కేంద్రం చేతులు ఎత్తేసిందని . మేము తీసుకోమని నిరాకరిస్తున్నదని అన్నారు.ధాన్యం సంగతి ఏందో తేలుస్తామని. కేంద్ర ఆహారశాఖ మంత్రిని డిమాండ్‌ చేస్తు ఉన్న ధాన్యం విషయములో కేంద్ర ప్రభుత్వ వైఖరిని  ప్రకటించాలి. తెలంగాణ రైతాంగాన్ని మీరు మోసం చేస్తే ఊరుకునేది లేదు.
 కేంద్రంపై ముఖ్యమంత్రి  కేసీఆర్‌ యుద్ధం ప్రకటించారు. ఉత్తర భారతంలో కొట్లాడుతున్నటువంటి రైతన్నలకు అండగా మీము ఉంటామని, తాము కూడా ధర్నాలు చేస్తామని స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు మేం కూడా పెడుతం ధర్నాలు.  ఉత్తర భారతంలో రైతులు ఎవరైతో కొట్లాడుతు ఉన్నరో వారికి అండగా ఉంటాం. రైతు వ్యతిరేక చట్టాలను మొత్తం వెనక్కి తీసుకోవాలె. ధర్నా చేస్తం. సీరియస్‌గానే కొట్లాడుతం. డీజిల్‌, పెట్రోల్  మీద పెంచినటువంటి సెస్‌లు వెంటనే విరమించుకోవలె. మిమ్ముల్ని పండనియ్యం అని చెప్పారు.
వ్యవసాయ రంగంపై కుట్ర జరుగుతోందని
రైతు ఆయన పొలంలో అతను జీతగాడిగా పనిచేయాలా..? వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసే కుట్ర కూడా జరుగుతున్నదని ఈ యొక్క  కుట్రలను ఛేదిస్తాం. కుట్రలను బయటపెడతాం. దీనిపై పార్లమెంటు దద్దరిల్లేలా కూడా చేస్తాం. రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడతాం. ధాన్యం కొనుగోళ్ల సంగతి కూడా పార్లమెంటులో ఉంచుతాం. మా రాష్ట్రనికి వచ్చే కోటా ఏందో నిర్ణయించాలని జిల్లా కేంద్రాలలో ధర్నాలు చేస్తం. 2,600 రైతు వేదికలలో ధర్నాలు చేస్తాం. అవసరమైతే నాతో సహా మొత్తం తెలంగాణ కేబినెట్‌,  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం ప్రజాప్రతినిధులం పోయి అక్కడ వడ్లు కొనాలని ఢిల్లీలో ధర్నా పెడతాం. పంజాబ్‌లో మాత్రం ధాన్యం 100 శాతం సేకరిస్తరంట. మరి తెలంగాణ ధాన్యం ఎందుకు కొనరు..? మొదట దీనికి మీరు సమాధానం చెప్పాలి. కేంద్రప్రభుత్వానికి ఒక్కో రాష్ర్టానికో నీతి ఉంటదా..? కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం  చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మొత్తం ధాన్యాన్ని సేకరించాలి. తెలంగాణలో ప్రొడక్టివిటీ ఇంకా  ఎక్కువ. దేశానికి నేడు తెలంగాణ అన్నం పెడుతు ఉన్నది. ఇది చూసి మీకు కండ్లు మండుతున్నయ్‌. తెలంగాణ రైతన్నలు సంతోషపడితే మీ కడుపులు ఉడికిపోతున్నాయి. పిచ్చి ప్రయోగాలను మానుకొని,  జాగ్రత్తగా వ్యవహారం చెయ్యాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: