వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?
ఈ క్రమంలోనే టీకా తీసుకుంటే ఉచితంగా బీర్లు ఆహార పదార్థాలు లాటరీ టికెట్లు వంటి వాటిని కూడా ఇచ్చి ప్రోత్సహిస్తుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. కాగా ఎంతోమంది ఈ ఆఫర్ లకు ఆకర్షితులై ఇష్టం లేకపోయినప్పటికీ వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా అదిరిపోయే ఆఫర్ లు ఇస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఒక కంపెనీ మిలియన్ డాలర్ వ్యాక్స్ లాటరీ ని రూపొందించారు.. ఇక ఈ లాటరీ టికెట్ విషయంలో అటు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.
ఈ ఆఫర్ కి ఆకర్షితులైన జనాలు ఇక ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 లక్షల మందికి పైగా ప్రజలు వ్యాక్సిన్ వేయించుకున్నారు. అంతేకాకుండా లక్కీ డ్రాలో తమ పేర్లు కూడా నమోదు చేశారూ. అందరూ అయితే ఇటీవలే ఈ లక్కీ డ్రా లో నుంచి పేరుని తీయగా 25ఏళ్ల ఝా అనే యువతి లక్కీ డ్రా గెలుచుకుంది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా ఎగిరి గంతేసింది. అయితే ఈ డబ్బుతో కొంత భాగం కుటుంబ సభ్యుల కోసం విభజించడమే కాదు భవిష్యత్తు అవసరాల కోసం కూడా ఖర్చు పెట్టుకుంటా అంటూ తెలిపింది.. ఏకంగా ఇలా లాటరీలో 7.4 కోట్ల రూపాయలను గెలుచుకుంది సదరు యువతి.